02/7/19 9:36 PM

గ్రేట్ : ఏ హీరో చేయని పని రాంచరణ్ చేశాడు

Ram Charan Sensational Decision

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన గొప్ప మనసు చాటుకున్నాడు. తన వల్ల ఆర్థికంగా నష్టపోయిన వారికి అండగా నిలిచాడు. కొంతలో కొంత వారి నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే ఊరమాస్ దర్శకుడు బోయపాటి శ్రీను, చరణ్ కాంబోలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. సినిమా ప్రేక్షకులనే కాదు మెగా అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. నెగిటివ్ టాక్ కారణంగా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. దీంతో భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది.

 

ఈ సినిమా వలన బయ్యర్లు 30 కోట్ల వరకూ నష్టపోయారట. వాళ్ల నష్టాన్ని కొంతవరకైనా తగ్గించాల్సి బాధ్యత తమపై ఉందనే అభిప్రాయాన్ని నిర్మాత దానయ్య దగ్గర చరణ్ వ్యక్తం చేశాడట. దాంతో ఇద్దరూ కలిసి ఓ 15 కోట్లను పరిహారంగా చెల్లిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఈ సినిమాకి గాను తాను తీసుకున్న పారితోషికంలో నుంచి 5 కోట్లను తిరిగి ఇచ్చేయడానికి చరణ్ సంసిద్ధతను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మిగతా 10 కోట్లను సమకూర్చే విషయంలో దర్శక నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

 

వినయ విధేయ రామ సినిమా గురించి చరణ్ ఫ్యాన్స్‌కు ఓపెన్ లెటర్ రాసిన సంగతి తెలిసిందే. సినిమా బాగోలేదని స్వయంగా చరణే అంగీకరించాడు. అభిమానుల అంచనాలను అందుకోలేకపోయామని, ఇలాంటి సినిమా తీసినందుకు నన్ను క్షమించండి, భవిష్యత్తులో మంచి సినిమాలు వచ్చేలా కృషి చేస్తాను అని చెబుతూ ఒక ప్రెస్ నోట్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశాడు. సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా డబ్బాలు కొట్టుకునే హీరోలు ఎందరో ఉన్న ఈ రోజుల్లో.. మెగా హీరో అయినప్పట్టికి ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి… సినిమా బాగోలేదని స్వయంగా అంగీకరించిన చరణ్ పట్ల ప్రశంసలు వెల్లువెత్తిన విషయం విదితమే. ఇప్పుడు ఆర్థికంగా నష్టపోయిన వారికి అండగా నిలబడాలని చరణ్ తీసుకున్న నిర్ణయం.. మెగా పవర్ స్టార్ ని మరోసారి రియల్ హీరోగా నిలబెట్టింది.

Tags : Buyersdistributorsgive back moneyram charansensational decisionVinaya Vidheya RamaVVR

Also read

Use Facebook to Comment on this Post



Menu