06/13/18 6:53 PM

చిరంజీవి సూపర్ హిట్ సినిమా పై మనసు పారేసుకున్న చెర్రీ..!

Untitled-1 copy

రంగస్థలం సినిమాతో తెలుగు సినిమా రంగంలో కలెక్షన్ల మోత మోగించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మాస్ కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ని అద్భుతంగా చూపించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు డైరెక్టర్ బోయపాటి. ఈ క్రమంలో చెర్రీ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో 90 లలో విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమా రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ నుండి వస్తున్న టాక్.

 

దీనికి అనుగుణంగానే తాజాగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సాయి ధరమ్ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యూ ఆడియో వేడుకలో మాట్లాడుతూ.. చరణ్ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తాడని చెప్పాడు. ఆ సినిమా గ్యాంగ్ లీడర్ కి రీమేక్ అన్న ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. ఒరిజినల్ కథని ఈ జనరేషన్ కి తగ్గట్టు మార్చి సినిమాని రీమేక్ చేయాలని నిర్మాత కేఎస్ రామారావు ప్రయత్నిస్తున్నారట.

 

అప్పట్లో గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి అద్భుతమైన విజయాన్ని అందించింది. విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ 1991లో మే 9న విడుదలై భారీ విజయాన్ని సాధించి బాక్సాఫీస్ దగ్గర అప్పటిదాకా ఉన్న రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలో చిరంజీవి పక్కన విజయశాంతి హీరోయిన్ గా నటించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగులు అప్పట్లో అనేక సంచలనాలు సృష్టించాయి. ఒకవేళ చెర్రీ గ్యాంగ్ లీడర్ సినిమా రీమేక్ చేయాలనుకుంటే గనుక రాజమౌళి మల్టీస్టారర్ సినిమా తరువాతే మొదలవుతుందని సమాచారం.

Tags : boyapatiboyapati srinuchiranjeevichiruGang Leadergang leader remakegangleaderram charanSai Dharam Tej Supreme

Also read

Use Facebook to Comment on this Post



Menu