07/9/19 9:27 PM

వర్మా.. ఇది మరీ టూ మచ్ గా లేదూ..

Ram Gopal Varma Comments On Baahubali

సంచలన, వివాదాస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తీరే వేరు. ఆయన మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ప్రపంచం మొత్తం ఒకవైపు నడిస్తే.. వర్మగారు.. అడ్డంగా మరోవైపు నడుస్తారు. వర్మ మాటలు, చేష్టలు, ఆలోచనా విధంగా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. మరోసారి ఆర్జీవీ నైజం బయటపడింది. ప్రపంచం మొత్తం టాలీవుడ్ ని, మనోళ్ల ప్రతిభను ప్రశంసించేలా చేసిన బాహుబలి సినిమా గురించి వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి సినిమాని కబీర్ సింగ్ సినిమాతో పోల్చారు. అంతేకాదు.. బాహుబలికంటే 16 రెట్లు సూపర్ హిట్ అని కామెంట్ కూడా చేశారు.

 

‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై వర్మ ప్రశంసలు కురిపించారు. సందీప్‌ను పొగడటంలో తప్పు లేదు. కానీ వర్మ చేసిన పోలికే కలకలం రేపింది. సందీపే తీసిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’.. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి కంటే మిన్న అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

 

‘‘నా దృష్టిలో ‘కబీర్ సింగ్’ బాహుబలి-2 కంటే 16 రెట్లు ఎక్కువ లాభాలు ఆర్జించింది. కబీర్ సింగ్ 6 నెలల్లో తీస్తే.. బాహుబలికి రెండేళ్లు పట్టింది.. మన సినిమాల్లోని రొటీన్ పాత్రలకు ప్రేక్షకులు అలవాటుపడ్డారు. కానీ సందీప్ ఆ ట్రెండ్ మార్చాడు. కబీర్ సింగ్ విజయం అతనేంటో ప్రపంచానికి పరిచయం చేసింది’’ అని వర్మ పేర్కొన్నాడు. అంతేకాదు.. ఓ ఇంటర్వ్యూలో ప్రేమికుల మధ్య వ్యహారంపై సందీప్ వంగా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో వర్మ అండగా నిలబడ్డారు. అంతా సందీప్ ని తిడుతుంటే.. వర్మగారు సపోర్ట్ చేశారు. సందీప్ నిజాయతీగా, ధైర్యంగా ఇంటర్వ్యూ ఇచ్చాడని కొనియాడారు.

 

ఏది ఏమైనా వర్మ తీరే వేరు. ఏది తోస్తే అది చెప్పి తీరుతారు. వర్మ తీరుని కొందరు సినీ అభిమానులు తప్పుపట్టారు. కబీర్ సింగ్ బాగుందని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు.. కానీ బాహుబలితో కంపేర్ చెయ్యడం.. దాన్నికన్నా సూపర్ హిట్ గా ఉందని చెప్పడం.. మరీ టూ మచ్ అని మండిపడుతున్నారు. అసలు వర్మకి.. బాహుబలి సినిమా అన్నా, రాజమౌళి అన్నా.. ఎందుకంత మంట అని అడుగుతున్నారు.

 

Tags : Arjun reddybaahubalikabir singhrajamouliram gopal varmaRGVsandeep vanga

Also read

Use Facebook to Comment on this PostMenu