10/14/18 11:51 AM

ఎట్టకేలకు చంద్రబాబు ఆచూకీ తెలుసుకున్న రాంగోపాల్ వర్మ

varma chandrababu

రాంగోపాల్ వర్మ నిరీక్షణ ఫలించింది. చంద్రబాబు ఆచూకీ తెలిసిపోయింది. దీంతో చెప్పినట్టుగానే లక్ష రూపాయలు ఇస్తున్నట్టు వర్మ ప్రకటించాడు.

 

చంద్రబాబు ఏంటి? ఆచూకీ తెలియడం ఏంటి? అని సందేహం వచ్చిందా? ఆ వివరాల్లోకి వెళితే.. వర్మ వెతుకున్న చంద్రబాబు రియల్ కాదు.. డూప్.. కొద్ది రోజులుగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలికలతో ఉన్న వ్యక్తి ఓ హోటల్‌లో సర్వ్‌ చేస్తూ అందులో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విపరీతంగా వైరల్‌ అయిన వీడియో క్లిప్‌పై సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించాడు.

 

తాను నిర్మిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో చంద్రబాబు పాత్రను పోషించే వ్యక్తి దొరికేశాడని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. ఓ వీడియాలో అచ్చం చంద్రబాబులా కనిపిస్తున్న ఓ హోటల్ వెయిటర్ ను చూపించిన వర్మ, అతను ఎవరో తెలిస్తే చెప్పాలని, అతనికి రూ. లక్ష ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

ఈ నేపథ్యంలో ఓ న్యూస్ చానెల్ లో పనిచేస్తున్న ఓ యువకుడు, అతని ఆచూకీపై వర్మకు సమాచారం అందించాడట. ఇక అదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో తెలిపిన వర్మ, ఆ యువకుడికకి కృతజ్ఞతలు తెలిపాడు. సినిమా ప్రారంభంలో అతని పేరును తెరపై వేస్తామని చెప్పాడు. వెంటనే బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయాలని, ఆ వెంటనే తాను ప్రకటించిన లక్ష రూపాయలను పంపుతానని చెప్పాడు.

 

చాలా రోజులు క్రితం వర్మ ప్రకటించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను అక్టోబర్‌19 నుంచి ప్రారంభించనున్నాడు. దివంగత నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా తీయనున్న మూవీ లాంచింగ్ ఈవెంట్‌ను దసరా (విజయదశమి) రోజు నిర్వహించనున్నట్లు వర్మ తెలిపాడు. ఎన్టీఆర్‌ జీవితంలోని కీలక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరిలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు.

Tags : CBNchandrababu dupelakshmis ntrlook alikentr true storyram gopal varma

Also read

Use Facebook to Comment on this Post



Menu