02/14/19 1:05 PM

బాబోయ్ ఇదేం క్రేజ్ : దుమ్మురేపుతున్న ”లక్ష్మీస్ ఎన్టీఆర్” ట్రైలర్

Ram Gopal Varma Release Lakshmis NTR Trailer

నందమూరి హీరో బాలకృష్ణ ఏ క్షణాన తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథపై సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేశారో.. అప్పుడే వివాదాస్పద సినిమాల దర్శకుడు రాం గోపాల్ వర్మ సైతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ప్రకటించారు. అనౌన్స్ చేయడమే కాదు.. సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి, చంద్రబాబు పాత్రలకు సంబంధించిన లుక్స్ రిలీజ్ చేసిన వర్మ.. మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడే కొద్దీ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ను జోరుగా చేస్తున్నాడు. ఫిబ్రవరి 14వ తేదీ వాలెంటైన్స్ డే సందర్భంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌ను వర్మ రిలీజ్ చేశారు. నిజమైన ప్రేమకు ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి ఐకాన్స్ అంటూ కామెంట్ చేశారు.

 

ఈ ఉదయం 9.27 గంటలకు నెట్టింట్లోకి వచ్చిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ నిమిషాల్లోనే వైరల్‌ అయ్యింది. ట్రైలర్ ను చూసేందుకు పోటీ పడుతున్నారు. నిమిషానికి 5 వేల వ్యూస్ వస్తున్నాయి. ట్రైలర్ ను అప్ లోడ్ చేసిన తొలి 16 నిమిషాల్లోనే 65 వేలకు పైగా వ్యూస్ రాగా, అరగంట వ్యవధిలో లక్షన్నర వ్యూస్ కు చేరుకుంది. ఇక, ఈ ట్రైలర్ పై టీడీపీ అభిమానులు మండిపడుతుండగా.. వర్మ ఫ్యాన్స్, ఇతర పార్టీల వారు మాత్రం ‘సూపర్బ్’ అని కామెంట్లు పెడుతున్నారు. లక్ష్మీ పార్వతిగా యజ్ఞా శట్టి చక్కగా కుదిరారని కితాబులు కూడా వస్తున్నాయి. ట్రైలర్ లో చూపించిన కొన్ని పాత్రలపై నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి.

 

ట్రైలర్ కు గంట వ్యవధిలో 5.5 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో వర్మ ఆనందం వ్యక్తం చేశారు. తన చిత్రాన్ని స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు ఆశీర్వదించేశారని అన్నారు. “వావ్… గంటలో 5.5 లక్షల వ్యూస్. దేవుడు ఎన్టీఆర్ ఆశీర్వదించారు” అని వర్మ ట్వీట్ పెట్టారు.

 

కాగా, వర్మ టాలెంట్ పై ప్రశంసలు వెల్లువెత్తాయి. వర్మ కానీ మనసుపెట్టి చేస్తే ఆ చిత్రం ఎలా ఉంటుందో నిరూపించాడని ఫ్యాన్స్ అంటున్నారు. నిత్యం వివాదాలతో సావాసం చేసే వర్మకు సరైన సబ్జెక్ట్ దొరికితే ఆయన డైరెక్షన్ టాలెంట్ ఎలా ఉంటుందో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ద్వారా నిరూపితం అయిందని చెబుతున్నారు. ఈ ట్రైలర్ లో ఆర్జీవీ బలమైన భావోద్వేగాలతో కేక పెట్టించాడని కితాబిస్తున్నారు.

Tags : cm chandrababulakshmis ntr trailernt rama raoram gopal varamRGVviewsviralyoutube

Also read

Use Facebook to Comment on this Post



Menu