12/26/18 1:21 PM

ఈ సినిమాతో అయినా ఇద్దరి ఫేట్ మారేనా?

Ram Pothineni, Puri Jagannadhs next movie

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. అయితే, ఇటీవల చేసిన సినిమాలేవీ వర్కవుట్ కాలేదు. అన్నీ నిరాశపరిచాయి. దాంతో మంచి కథ కోసం వెయిట్ చేస్తూ గ్యాప్ తీసుకున్న రామ్‌.. పూరి జగన్నాథ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హలో గురు ప్రేమకోసమే తర్వాత తన కొత్త సినిమాని పూరితో చెయ్యబోతున్నట్టు.. అనౌన్స్ చేశాడు రామ్. ‘నన్ను మంచివాడిగా చూసి బోర్ కొట్టిందా .. అయితే ఇప్పుడు చెడ్డడిగా చూడండి’ అంటూ పూరి, ఛార్మితో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు రామ్.

 

బోల్డ్ కంటెంట్‌తో ఈ సినిమా రూపొందనున్నట్టు రామ్ చెప్పాడు. ఈ సినిమాలో రామ్ కొత్తలుక్‌తో కనిపించనున్నట్టు తెలుస్తోంది. రామ్‌కి ఇది 17వ సినిమా. ప్రస్తుతం హీరోయిన్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. చార్మితో కలిసి పూరి జగన్నాథ్ తన సొంత బ్యానర్‌లో ఈ సినిమాని నిర్మించబోతున్నాడు.

 

కొన్నాళ్లుగా హిట్ అన్న పదానికే మొహం వాచిపోయిన దర్శకుడు పూరి జగన్నాధ్. ఈ మధ్య కాలంలో ఏ సినిమా తీసినా అట్టర్ ఫ్లాపే. దీంతో తన ఫేట్ మార్చుకునే పనిలో పడ్డాడు పూరి. అయితే డైరెక్టర్‌గా ఎవరికీ లేని ఓ ప్రత్యేక పూరికి ఉంది. తన సినిమాల్లో హీరోని విలక్షణంగా, పవర్ ఫుల్‌గా చూపించడంలో పూరి దిట్ట. హీరోని డిఫరెంట్‌గా చూపించడంలో పూరి స్టైలే వేరు. ఈ మూవీలోనూ రామ్‌ని, తన స్టైల్‌లో కొత్తగా ప్రజెంట్ చెయ్యబోతున్నాడట పూరి. రామ్ బాడీ లాంగ్వేజ్, గెటప్ అన్నీ కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. ఇక సినిమా ఓపెనింగ్ రోజునే రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యడం పూరి స్టైల్… మాగ్జిమమ్ మూడు, నాలుగు నెలల్లోనే సినిమా షూటింగ్ ఫినిష్ చేస్తాడు. రామ్‌తో సినిమా షూటింగ్‌ని కూడా 2019 జనవరిలో స్టార్ట్ చేసి, మే లో రిలీజ్ చెయ్యబోతున్నామని ప్రకటించేసాడు. పూరి స్పీడ్‌కి, రామ్ ఎనర్జీ యాడ్ అయితే మామూలుగా ఉండదని ఫ్యాన్స్ అంటున్నారు. ఒకప్పుడు వరస హిట్స్‌తో తన సత్తా చాటిన పూరి, గత కొద్ది కాలంగా తన మార్క్ చూపడంలో విఫలమవుతూ వస్తున్నాడు. ఇక రామ్ పరిస్థితి కూడా అంతే. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే సినిమాలతో వెనకబడ్డాడు. ఇప్పుడు రామ్, పూరి కలిసి చెయ్యబోయే సినిమా కచ్చితంగా హిట్ అయితేనే తిరిగి మళ్ళీ ట్రాక్‌లోకి వస్తారు.

Tags : charmi kaurDirector Puri Jagannadhnext movieram pothineni

Also read

Use Facebook to Comment on this Post



Menu