01/10/19 11:05 AM

బాలయ్యను టార్గెట్ చేయడానికి కారణం ఇదే : నాగబాబు

Reason Behind Nagababu To Target Balakrisha

నందమూరి నట సింహం బాలకృష్ణను మెగాబ్రదర్ నాగబాబు టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. బాలయ్య చేసిన ఆరు వ్యాఖ్యలకు ఆరు కౌంటర్లు అంటూ వరుసపెట్టి నాగబాబు వీడియోలు వదిలారు. ఫేస్ బుక్ వేదికగా బాలకృష్ణను నాగబాబు ఏకిపారేశారు. ప్రశ్నలు, విమర్శలతో విరుచుకుపడ్డారు. నువ్వు ఏమైనా తోపా? అంటూ చెలరేగిపోయారు. తన క్రియేటివిటీ ఉపయోగించి ”ఎర్రోడి వీరగాథ” పేరుతో షార్ట్ ఫిలిమ్ కూడా రిలీజ్ చేసి బాలయ్య పరువు గంగలో కలిపారు. నా అన్న, తమ్ముడిని అంటావా? నా ఫ్యామిలీ జోలికొస్తావా? అంటూ బాలకృష్ణను చెడుగుడు ఆడుకున్నారు నాగబాబు. బాలయ్యని టార్గెట్ చేస్తూ నాగబాబు పెట్టిన పోస్టులు దుమారం రేపాయి. బాలకృష్ణ, మెగా అభిమానుల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. అయితే బాలకృష్ణని టార్గెట్ చేయడానికి అసలు కారణం ఏంటో నాగబాబు చెప్పారు.

 

బాలయ్యపై తాను ఇంతలా రియాక్ట్‌ అవ్వడానికి కారణాలు చెబుతూ నాగబాబు ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. తాను ఎప్పుడూ బాలకృష్ణను వ్యక్తిగతంగా విమర్శించలేదని, తన ఫేస్‌బుక్‌ పోస్టుల్లో ఎక్కడా ఆయన పేరు ప్రస్తావించలేదని చెప్పారు. తమపై గతంలో బాలయ్య చేసిన కామెంట్లపై కూడా ఎప్పుడూ రియాక్ట్‌ కాలేదన్నారు. పవన్‌ కల్యాణ్‌పై బాలయ్య వ్యక్తిగతంగా విమర్శలు చేసినా అన్నయ్యగా తాను ఒక్క మాట అనవద్దా? అని ప్రశ్నించారు. బాలయ్య తెలవదు.. పెద్ద బాలయ్య తెలుసని ఒక్క మాటంటే ఇంత వివాదం చేస్తారా? వ్యక్తిగతంగా విమర్శలు చేయాలంటే 100 చేస్తామని, కానీ అలా చేయడం పద్దతి కాదన్నారు.

 

తన పోస్టుల్లో ఎక్కడా బాలయ్య పేరును ప్రస్తావించలేదని మెగాబ్రదర్ స్పష్టం చేశారు. గుమ్మడికాయల దొంగ ఎవరు? మీరేందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. బాలయ్య మెగాబ్రదర్స్‌పై ఐదు సార్లు నోరు జారి వ్యక్తిగతంగా విమర్శించినా తాము ఏమీ అనలేదని నాగబాబు గుర్తు చేశారు.

 

బాలకృష్ణకు అసలు సిసలు కౌంటర్‌ (గురువారం) ఇవ్వబోతున్నట్లు మెగా బ్రదర్‌ నాగబాబు తెలిపారు. 2011లో చిరంజీవీపై బాలయ్య చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌ ఇచ్చి ఈ వివాదానికి ముగింపు పలుకుతానని స్పష్టం చేశారు. అప్పుడే ఇవ్వాలనుకున్నానని, కానీ తమ అన్నయ్య ఆపారన్నారు. తనకేం పబ్లిసిటీ పిచ్చిలేదని, వివాదాలతో పాపులారిటీ కావాలనుకోవడం లేదని నాగబాబు స్పష్టం చేశారు. ఓ ఆర్టిస్ట్‌గా తనకు ఉండాల్సిన గుర్తింపు ఉందని, అంతకు మించి అవసరం లేదని నాగబాబు చెప్పారు. అయితే ఫైనల్‌గా నాగబాబు ఇచ్చే కౌంటర్ ఏంటా? అనేది ఆసక్తికరంగా మారింది. ఫినిషింగ్ వీడియోలో నాగబాబు ఏం మాట్లాడతారా? అని అటు బాలయ్య అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Tags : balakrishnachiranjeevifinal videomega brothernagababunagababu vs balakrishnaPawa kalyanvideo war

Also read

Use Facebook to Comment on this PostMenu