04/15/18 4:33 PM

‘కృష్ణార్జున యుద్ధం’ అట్టర్ ఫ్లాప్ అని నానికి ముందే తెలుసు..?

Untitled-1 copy

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రమోషన్ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తాడు హీరో, నాచురల్ స్టార్ నాని. నాని సినిమాలు వరుసగా హిట్టు అవడంలో ప్రమోషన్ కార్యక్రమాలు పెద్ద పాత్రను పోషిస్తాయి. ఇటీవల తాజాగా విడుదలైన కృష్ణార్జున యుద్ధం సినిమా విషయంలో మాత్రం హీరో నాని ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో సరిగా శ్రద్ధ వహించలేదు.

 

తన సినిమాలో ప్రతి పాత్ర గురించి వినూత్నంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రచారం చేసే నాని…ఈ సినిమా విషయంలో పెద్ద ఆసక్తి చూపించలేదు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలై సినిమా హాల్ లో ఆడుతోంది. కాగా, నాని సినిమాపై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ కు అనుగుణంగా ఏ మాత్రం పెర్ఫామ్ చేయడం లేదు.

 

న్యాచురల్ స్టార్ గత చిత్రంతో పోల్చితే అంతంత మాత్రమే తొలిరోజు వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు టాక్ దెబ్బకు రెండో రోజు వసూళ్లు మరింతగా తగ్గిపోయాయి. దీన్ని బట్టి హీరో నాని తీరును మొదటి నుంచి చూస్తే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించదనే విషయాన్ని నాని ముందే పసిగట్టినట్టు ఉన్నాడనే విషయం అర్థమవుతుంది. అందుకే హీరో నాని సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కుడా పాల్గొనడానికి పెద్ద ఆసక్తి చూపించలేదు అని చెప్పుకుంటున్నారు.

Tags : flopKrishnaarjuna yudhamKrishnarjuna yuddhammerlapaka gandhinaninatural starno promotionsTollywood

Also read

Use Facebook to Comment on this Post



Menu