11/3/18 9:42 PM

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది..

2.o trailer

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న 2.ఓ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది. చెన్నైలోని సత్యం సినిమాస్ లో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో శనివారం ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబోకు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

 

ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. 4డీ టెక్నాలజీతో ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ సినిమా కోసం చిత్రబృందం ఎంతగా కష్టపడిందో ట్రైలర్ ని చూస్తే అర్ధమవుతుంది.

 

ట్రైలర్ మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీట వేశారు. ‘సెల్ ఫోన్ వాడుతున్న అందరూ హంతకులే.. సెల్ ఫోన్ చూడగానే ప్రాణభయంతో చెల్లాచెదురవుతారవుతారు చూడు’ అంటూ విలన్ పాత్ర అక్షయ్ కుమార్ చెప్పిన డైలాగ్ ని బట్టి సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

దర్శకుడు శంకర్ అధ్బుతాల్లో ఇది ఎప్పటికీ నిలిచిపోతుందనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కి భారీ స్పందన లభించింది. కాగా, ఇప్పటివరకు 4డీ టెక్నాలజీతో ఏ ఇండియన్ సినిమా విడుదల కాలేదు. చెన్నైలోని సత్యం సినిమాస్ లో జరిగిన ఈ వేడుకకి దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్, సంగీత దర్శకుడు రెహ్మాన్ తో పాటు హీరోయిన్ చిత్రబృందం పాల్గొన్నారు.

 

ఒక్క చెన్నైలోనే కాక సింగపూర్, మలేషియా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, న్యూజిలాండ్, యూఎస్ఏ, యూకే, యూఏఈ, సౌదీ అరేబియా, రష్యా వంటి పలు దేశాల్లో వివిధ సమయాలలో ట్రైలర్ ను రిలీజ్ చెయ్యడం విశేషం. కేవలం ట్రైలర్‌నే ఈ స్ధాయిలో విడుదల చెయ్యడం రికార్డ్ అనే చెప్పాలి. సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఇండియాతో పాటు విదేశాల్లో సైతం ఫ్యాన్స్ ఉన్నారన్న సంగతి తెలిసిందే.

 

దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా గత కొద్దిరోజులుగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమాని నవంబర్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags : 2.0 Official TrailerA.R rahmanAkshay kumarrajinikanthshankarSubaskaranTelugu

Also read

Use Facebook to Comment on this PostMenu