04/24/19 9:44 PM

RRR చిత్రానికి వరుస అడ్డంకులు

RRR Shooting Jr NTR Injured

RRR.. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ. ఇద్దరు అగ్రహీరోలు ఇందులో యాక్ట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి వరుసగా అడ్డంకులు తగులుతున్నాయి. కొని వారాల క్రితం ఈ చిత్ర హీరోల్లో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్ 3 వారాలు వాయిదా పడింది. తాజాగా ఎన్టీఆర్‌ కూడా గాయపడ్డాడు.

 

ఎన్టీఆర్ కుడి చేతికి గాయం అయినట్టు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ గాయం మరీ పెద్దదేమీ కాదని తెలుస్తోంది. చేతికి కట్టుతోనే ఎన్టీఆర్ షూటింగ్‌కు వస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్‌‌కు జోడిగా ఇంకా ఎవరినీ తీసుకోలేదు. మొదట్లో బాలీవుడ్ నటి డైసీని ప్రకటించినప్పటికీ ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.

 

ఎన్టీఆర్ చేతి కట్టు చూసిన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తమ హీరోకి ఏమైందో అని కంగారు పడ్డారు. అయితే ఆ గాయం షూటింగ్ లో తగిలిందా? లేక బయట తగిలిందా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. గాయం తగిలినా డాక్టర్స్ అనుమతితో తారక్ షూటింగ్ లో పాల్గొన్నాడట. ఎన్టీఆర్ చేతికి గాయాలు తగిలిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి మాత్రం ఇంకా హీరోయిన్ కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నారు. మొత్తానికి ఇద్దరు హీరోస్ కి గాయాలు అయ్యాయి. అవి ఎప్పటికి సెట్ అవుతాయో షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి. బాహుబలి లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత రాజమౌళి RRR ని ప్రారంభించారు. పాపం రాజమౌళి RRR సినిమాకి దిష్టి తగిలిందో ఏమో తెలియదు గాని వరుసగా అడ్డంకులు ఎదురవుతున్నాయి అని అభిమానులు వాపోతున్నారు.

Tags : injuredJr.NTRrajamouliram charanrrr

Also read

Use Facebook to Comment on this Post



Menu