06/8/19 8:57 PM

రాజమౌళా మజాకా : భారీగా ఖర్చు పెట్టేస్తున్నాడు

RRR Update, 45 Crores For Action Scene

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలే రాజమౌళి.. ఆపై అగ్రహీరోలు.. దీంతో ఈ సినిమా ఖర్చు విషయంలో అస్సలు తగ్గడం లేదు. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త హల్ చల్ చేస్తోంది. ఓ యాక్షన్ సన్నివేశం కోసం ఏకంగా రూ.45 కోట్లను ఖర్చు చేస్తున్నారు. రెండు వేల మందితో ఈ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

 

ఇప్పటికే ఈ యాక్షన్ సన్నివేశం కోసం వందల మంది యూనిట్ సభ్యులు ఆరు నెలలపాటు శిక్షణ తీసుకున్నట్టు సమాచారం. ఓ ఇంగ్లీష్ పేపర్ కథనం ప్రకారం, రెండు నెలల పాటు జరగబోయే షెడ్యూల్‌లో చివరి యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించనున్నారట. సినిమాకు చాలా కీలకమైన ఈ సన్నివేశంలో తారక్, చెర్రీలు దాదాపు 2 వేల మందితో ఫైట్ చేయబోతున్నారట. ఈ సీన్ కోసం దాదాపు రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్నారట. భారీ సెట్‌లో తెరకెక్కించే ఈ సన్నివేశంలో వందల మంది విదేశీయులు పాల్గొననున్నారట.

 

డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ గాయాల నుంచి కోలుకోవడంతో ఇక విరామం లేకుండా షూటింగ్ జరపాలని ఫిక్స్ అయ్యారు రాజమౌళి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు వేషం వేశాడు. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ చెర్రీ సరసన నటిస్తోంది. 2020 జులై 30న ఈ సినిమా విడుదల కానుంది.

Tags : 45 croresaction sceneJr.NTRrajamouliram charanrrrRRR movie

Also read

Use Facebook to Comment on this Post



Menu