09/8/18 6:01 PM

అప్పుడే, కోటి అడుగుతున్న ‘ఆర్‌ఎక్స్ 100’ హీరో!

Untitled-1 copy

రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి..  కేవలం రెండంటే రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘ఆర్ ఎక్స్ 100’ బాక్స్‌ఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించి ఈ ఏడాది టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో, ఈ సినిమాలో  హీరో హీరోయిన్లుగా నటించిన కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీంతో, వీరిద్దరూ ప్రస్తుతం తాము సైన్ చేసే చిత్రాలకు రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నారు.

 

ఇప్పటికే.. తమిళ అగ్ర నిర్మాత.. సూపర్ స్టార్ రజనీకాంత్‌ తో  ‘కబాలి’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించిన  కలైపులి ఎస్‌ థాను నిర్మించే ఓ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి సైన్ చేశాడు కార్తికేయ. తమిళ స్టార్ హీరో సూర్యతో ‘నువ్వు..నేను.. ప్రేమ’ చిత్రాన్ని రూపొందించిన కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి గాను కార్తికేయ అడక్కుండానే కలైపులి ఎస్‌.థాను అతడికి ఫ్యాన్సీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే, ప్రస్తుతం తనను అప్రోచ్ అవుతున్న నిర్మాతలకు తన పారితోషకం కోటి రూపాయలని కార్తికేయ చెబుతున్నాడట. మరీ ఒక్క సినిమాతోనే కోటి రూపాయలే అని కొందరు నిర్మాతలు కార్తికేయ దగ్గర తమ అసహనాన్ని వ్యక్తం చేయగా.. ‘ఆర్‌ఎక్స్‌ 100’ పెద్ద హిట్ అవడంతో పాటు.. తన తదుపరి సినిమాను కలైపులి ఎస్‌. థాను నిర్మిస్తుండటంతో.. రాబోయే తన చిత్రాలు కచ్చితంగా బాగా మార్కెట్ అవుతాయని.. ఈ నేపథ్యంలో తాను కోటి రూపాయలు డిమాండ్ చేయడం ఏ మాత్రం అన్యాయం కాదని కార్తికేయ సమాధానమిస్తున్నాడట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇదే కదా!

Tags : Ajay bhupathiKarthikeyaPayal rajputrx 100RX 100 heroRX 100 hero karthikeya demanding one crore remuneration

Also read

Use Facebook to Comment on this Post



Menu