10/3/18 3:46 PM

విద్యార్థుల మృతికి, RX100 సినిమాకి ఎలాంటి సంబంధం లేదు..!

RX 100 HERO KARTHIKEYA

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో పదో తరగతి విద్యార్థులు కూసరి మహేందర్ , రవితేజ నిప్పంటిచుకుంని మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వారు ఇద్దరు అమ్మాయిలతో చాటింగ్ చేసేవారు. ప్రేమ విషయంలో తలెత్తిన వివాదంతో మద్యం సేవించి, పెట్రోల్ పోసుకుని  ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసిన డీఎస్పీ వెంకటరమణ ఆర్ఎక్స్ 100 సినిమా ప్రేరణతోనే చనిపోయారని తెలిపారు. ఆ సినిమాలోని పిల్లా సాంగ్ ను ప్రేరణగా తీసుకున్నారని పోలీసులు చెప్పారు. దీంతో సినిమాల ప్రభావంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

 

అయితే  ఈ ఘటనపై ఆర్ఎక్స్ 100 సినిమా హీరో కార్తికేయ స్పందించాడు. ఇద్దరు విద్యార్థులు మా సినిమాను ప్రేరణగా తీసుకుని చనిపోయారని చెప్పడం సరైన పద్దతి కాదన్నాడు. మేం ఆర్టిస్టులమే కానీ ఉగ్ర‌వాదులం కాదన్నాడు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు మ‌రోసారి జ‌ర‌గ‌కుండా చూసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉందన్నాడు. అంతేకాదు నేటి యువ‌త చెడుకు ప్ర‌భావితం కాకుండా వారి న‌డ‌వ‌డిక‌ని గ‌మ‌నించాలన్నాడు. ఆర్ ఎక్స్ 100 సినిమానే ఓ విలన్‌ లా చూపిస్తున్నార‌ని, చిత్రంలో హీరో ఆత్మహ‌త్య‌ చేసుకోడని కార్తికేయ వివరించాడు. బాధాక‌రమైన సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు త‌మ‌ని నెగెటివ్‌గా చూడ‌డం మానేసి, పిల్ల‌ల‌ని స‌న్మార్గంలో న‌డిపించేలా ప్ర‌య‌త్నించాల‌ని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు కార్తికేయ ఓ ట్వీట్ చేస్తూ వీడియోను కూడా షేర్ చేశాడు. ఆర్ఎక్స్ 100 చిత్రం అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌లు ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఊహించని విధంగా వసూళ్లు సాధించింది.

Tags : artists not terroristsJagityal students suicideRx 100 hero kartikeya

Use Facebook to Comment on this Post



Menu