07/19/18 5:59 PM

బాక్సాఫీస్ దగ్గర ‘ఆర్‌ఎక్స్‌ 100’ కలెక్షన్ల ప్రభంజనం!

Untitled-1 copy

హీరో హీరోయిన్లు ఎవరో తెలీదు.. కాస్త నాటుగా చెప్పాలంటే ఊరు-పేరు లేని హీరో హీరోయిన్లు! దర్శకుడు కొత్త వాడు.. నిర్మాణ సంస్థ పేరు కనీసం ఫిలింనగర్‌లో ఓ నలుగురికి కూడా తెలీదు. ఇటువంటి వారి నుంచి వచ్చిన ఓ ‘అనామక’ సినిమా బాక్సాఫీస్  ను షేక్ చేస్తుందని, టాలీవుడ్ రికార్డులను బద్దలుకొడుతుందని, ఓ వారం క్రితం దాకా ఎవరూ నమ్మిఉండరు! కానీ ఇప్పుడు అదే జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్‌ఎక్స్ 100’ కలెక్షన్లు చూసి.. ఏళ్ల తరబడి సినీరంగంలో ఉన్న ట్రేడ్ పండితులు కూడా విస్తుపోతున్నారు.

 

గత ఏడాది రిలీజైన బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ ని తలదన్నేలా బాక్సాఫీస్ ను ‘ఆర్‌ఎక్స్ 100’ షేక్ చేస్తుందంటే అతిశయోక్తి కాదు. యూత్ ఆడియన్స్ కి, మాస్ ప్రేక్షకులకి సినిమా నచ్చితే ఏ రేంజ్ హిట్ అవుతుందడానికి ‘ఆర్‌ఎక్స్ 100’ తాజా ఉదాహరణ! కేవలం రెండు కోట్లతో నిర్మింపబడిన ఈ సినిమా ఆరు రోజుల పూర్తయ్యేసరికి 15 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాల నివ్వెరపోయేలా చేసింది. కేవలం తెలంగాణలోనే ఈ సినిమా ఆరు రోజులకి మూడు కోట్ల షేర్ ను సాధించదంటే ఈ సినిమా ప్రభంజనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  తొలత ఈ చిత్రాన్ని తెలంగాణలో 125 సెంటర్లలో రిలీజ్ చేశారు. ఏ రోజుకు ఆ రోజుకు ఈ సినిమాకు నైజామ్ ప్రాంతంలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో.. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా మరో 60 థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఏ సెంటర్‌.. బీ సెంటర్‌.. సీ సెంటర్ అన్న తేడా లేకుండా  ఇటు మల్టీప్లెక్స్ జనాలు.. అటు గ్రామీణ జనాలు ఆర్‌ఎక్స్ 100 ను ఇష్టపడుతున్నారు.   ఈ సినిమా దెబ్బకు మెగా అల్లుడు విజేత, కార్తి చినబాబు లు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే,  బాక్సాఫీస్ దగ్గర మరికొద్ది రోజులు ‘ఆర్ఎక్స్‌ 100’ ప్రభంజనం ఖాయంగా కనపడుతోంది.

Tags : Ajay bhupathiArjun reddyKarthikeyarx 100Tollywood

Also read

Use Facebook to Comment on this Post



Menu