09/7/19 8:31 PM

డివైడ్ టాక్ వచ్చినా.. వసూళ్ల సునామీ

Saaho 7 Days Record Collections

సాహో.. భారీ తారాగణం.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ. అంతకుమించి భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇలా రిలీజ్ అయ్యిందో లేదో.. అప్పుడే యావరేజ్ అన్నారు. ఆ తర్వాత ఫ్లాప్ అన్నారు. చివరికి డిజాస్టర్ అని డిసైడ్ చేశారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా తీవ్రంగా నిరాశ చెందారు. రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి భారీగా నష్టాలు తప్పవని సినీ విమర్శకులు తేల్చేశారు. కట్ చేస్తే.. సీన్ రివర్స్ అయ్యింది. సాహో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. భారీ కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఎవరూ ఊహించని విధంగా వసూళ్లు రాబడుతోంది. డిజాస్టర్ అన్న వారితోనే సాహో అనిపిస్తోంది. కంటెంట్ లేకపోయినా.. ప్రభాస్ స్టామినా కారణంగా వసూళ్ల వర్షం కురుస్తోందనే మాట వినిపిస్తోంది.

 

‘సాహో’ గత శుక్రవారం విడుదలైంది. తెలుగులో మార్నింగ్ షో తర్వాత యావరేజ్ అని టాక్ వచ్చింది. సాయంత్రానికి ఫ్లాప్ అని తేల్చేశారు. అయితే ఆ టాక్ వచ్చినా బాహుబలి ఎఫెక్ట్‌తో ప్రేక్షకులు మాత్రం ‘సాహో’ చూడటానికి పోటీపడ్డారు. భారీ అంచనాలతో వచ్చిన సాహోకి అనుకున్నట్టుగానే ఫస్ట్ డే అన్ని భాషల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది. మొదటి రోజే ఈ సినిమా ఓవరాల్‌గా రూ.138 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మొత్తంగా ఏడు రోజులకు అన్ని భాషల్లో కలిపి రూ.370 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే బాహుబలి 1,2.. 2.0 సినిమాల తర్వాత సౌత్ ఇండియాలో నాలుగో స్థానంలో ఉంది సాహో. అయితే తొలి వారం రోజుల్లో 4 రోజులు హాలీడేస్ ఉండటంతో భారీ వసూళ్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత వీక్ డేస్ మొదలు కాగానే సినిమా కూడా వీక్ అయిపోయింది. దాంతో బయ్యర్లకు కూడా టెన్షన్ మొదలైంది.

 

ఈ చిత్రం 290 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఇంకా దాదాపు రూ.85 కోట్లు వసూలు చేయాలి. రెండో వారం కూడా తెలుగులో ఏ భారీ సినిమా లేదు.. దాంతో ఖచ్చితంగా మరికొన్ని వసూళ్లు రావడం ఖాయం. అయితే తెలుగులో ఈ చిత్రం రూ.124 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ ఇప్పటి వరకు 6 రోజుల్లో వచ్చిన మొత్తం రూ.82 కోట్ల షేర్ మాత్రమే. అంటే ఇంకా రూ.42 కోట్లు వెనకబడే ఉంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అన్ని కోట్లు రావడం మాత్రం అంత ఈజీ కాదని చిత్ర వర్గాలు అంటున్నాయి. హిందీలో ఈ సినిమా ఇప్పటి వరకు రూ.110 కోట్లు వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెప్పాయి. మొత్తానికి డివైడ్ టాక్‌తోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది సాహో. అంతా ప్రభాస్ మహిమే అంటున్నారు ఫ్యాన్స్.

 

Image result for sahoo 370 crores

Tags : 7 daysbox office collectionsHindiprabhassaahostaminaSujithTollywood

Also read

Use Facebook to Comment on this Post



Menu