09/1/19 1:35 PM

సాహో డిజాస్టర్ అన్న వాళ్లకి ఇదే సమాధానం

Saaho Record Box Office Collections

సాహో.. డిజాస్టర్, అట్టర్ ప్లాఫ్, వరెస్ట్, దారుణం.. ఇలా అనేక రకాల కామెంట్స్, రివ్యూస్ వచ్చాయి. నెగిటివ్ టాక్ నడిచింది. అయినా సాహో సత్తా చాటింది. బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించింది. ఫస్ట్ డే నే కలెక్షన్స్ విషయంలో దుమ్ముదులిపింది. తొలి రోజే వంద కోట్లు రాబట్టింది. టాక్‌తో సంబంధం లేకుండా ‘సాహో’ తొలి రోజు రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో శుక్రవారం నాడు భారీగా విడుదలైన ‘సాహో’ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా రికార్డ్ ఓపెనింగ్స్ సాధించింది. దేశవ్యాప్తంగా ‘సాహో’ మూవీ తొలి రోజు 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

 

ఏరియాలవారిగా కలెక్షన్ల వివరాలు:
నైజాం: 14.1 కోట్లు
ఆంధ్రప్రదేశ్: 42.2 కోట్లు
కర్నాటక: 13.9 కోట్లు
తమిళనాడు: 3.8 కోట్లు
కేరళ: 1.2 కోట్లు
హిందీ (బాలీవుడ్): 29.6 కోట్లు
టోటల్ ఇండియా గ్రాస్ 104.8 కోట్లు
టోటల్ ఇండియా షేర్ 68.1 కోట్లు

 

ప్రభాస్ తన కెరీర్ లో వరుసగా రెండోసారి వందకోట్లు సాధించిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ‘బాహుబలి2’ కూడా తొలి రోజు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. దీంతో ప్రభాస్ వరుస చిత్రాలతో వంద కోట్ల క్లబ్‌లో చేరాడు.

 

కాగా.. హిందీలో 29.6 కోట్లు షేర్ సాధించి 2019లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘సాహో’ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మరోవైపు నైజాం ఏరియాలో బాహుబలి రికార్డ్‌ను బీట్ చేసింది ‘సాహో’. ఫస్ట్ డే నైజాంలో రూ. 14.1 కోట్లు సాధించిన చిత్రంగా ‘సాహో’ తొలిస్థానంలో నిలిచింది. ఇదే ఊపును వీకెండ్‌లో కొనసాగితే ‘సాహో’ బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

 

సాహో టాక్ చిత్ర యూనిట్ ని నిరాశకు గురి చేసినా.. కలెక్షన్లు మాత్రం ఆనందం నింపాయి. సుమారు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో సాహోని తెరకెక్కించారు. నెగిటివ్ టాక్ రావడంతో భారీ నష్టాలు తప్పవేమో అని భయపడ్డారు. అయితే ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ చూసి కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వరుసగా సెలవులు ఉండటంతో.. ఇదే జోరు కొనసాగి.. మరిన్ని కాసులు కురవాలని చిత్ర యూనిట్ కోరుకుంటోంది. మరి వారి కోరిక ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.

Tags : baahubalibox office collectionsdisasterfirst daygrossprabhassaaho

Also read

Use Facebook to Comment on this Post



Menu