09/6/19 8:05 PM

దటీజ్ ప్రభాస్ స్టామినా

Sahoo Record Box Office Collections

సాహో.. భారీ తారాగణం.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ. అంతకుమించి భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇలా రిలీజ్ అయ్యిందో లేదో.. అప్పుడే యావరేజ్ అన్నారు. ఆ తర్వాత ఫ్లాప్ అన్నారు. చివరికి డిజాస్టర్ అని డిసైడ్ చేశారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా తీవ్రంగా నిరాశ చెందారు. రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి భారీగా నష్టాలు తప్పవని సినీ విమర్శకులు తేల్చేశారు. కట్ చేస్తే.. సీన్ రివర్స్ అయ్యింది. సాహో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. భారీ కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఎవరూ ఊహించని విధంగా వసూళ్లు రాబడుతోంది. డిజాస్టర్ అన్న వారితోనే సాహో అనిపిస్తోంది. కంటెంట్ లేకపోయినా.. ప్రభాస్ స్టామినా కారణంగా వసూళ్ల వర్షం కురుస్తోందనే మాట వినిపిస్తోంది.

 

‘సాహో’ గత శుక్రవారం విడుదలైంది. తెలుగులో మార్నింగ్ షో తర్వాత యావరేజ్ అని టాక్ వచ్చింది. సాయంత్రానికి ఫ్లాప్ అని తేల్చేశారు. అయితే ఆ టాక్ వచ్చినా బాహుబలి ఎఫెక్ట్‌తో ప్రేక్షకులు మాత్రం ‘సాహో’ చూడటానికి పోటీపడ్డారు. దాంతో మొదటి నాలుగురోజులు అనేక చోట్ల హౌస్ ఫుల్స్ నడిచాయి. మంగళ, బుధవారాల్లో మాత్రం ‘సాహో’ కలెక్షన్స్‌లో భారీ డ్రాప్ కనిపించింది.

 

హిందీ వెర్షన్ పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. మన డార్లింగ్‌ని బాలీవుడ్ ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు. ‘సాహో’ జోరుకి అక్కడ అడ్డు లేదు. ‘సాహో’ హిందీ వెర్షన్ ఫైనల్ రిజల్ట్ హిట్‌గా డిసైడ్ అయ్యేలా ఉంది. ఆ రేంజ్‌లో కలెక్షన్స్ వస్తున్నాయి. కథలో దమ్ము లేకపోయినా హిందీలో కలెక్షన్స్ మాత్రం దుమ్ములేచిపోతున్నాయి. అక్కడి క్రిటిక్స్ ఒకటిన్నర రేటింగ్ ఇచ్చినా వాళ్ళని పట్టించుకున్నవాళ్ళు లేరు. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కలెక్షన్స్ కూడా మెరుగుపడ్డాయి. ఓవర్ ఆల్‌గా ‘సాహో’ మూవీ రూ. 350 కోట్లు కొల్లగొట్టింది. అయితే సాహో అప్పుడే పెట్టిన పెట్టుబడి రాబట్టింది కదా మిగిలిన రన్‌లో కూడా ఇంకో 20 నుండి పాతిక కోట్లు రాబడుతుంది కాబట్టి ఆ సినిమా హిట్ అని తీర్పు ఇచ్చేయడానికి లేదు.

 

గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రూ. 350 కోట్లు.. షేర్ వచ్చేసరికి రూ.200 కోట్లకు కాస్త తక్కువ అని ట్రేడ్ అనలిస్ట్‌‌లు లెక్కలు కడుతున్నారు. సో.. అలా చూసుకుంటే ఈ సినిమా ఇంకో రూ. 100 కోట్లు అయినా కలెక్ట్ చేస్తేగానీ హిట్ అనిపించుకోదు.

 

సాహో’ మూవీ తొలివారం వసూళ్లు చూస్తే…. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 73.97 కోట్ల షేర్ వసూలు చేసింది. బాహుబలి 2 మూవీ తర్వాత అత్యధిక ఫస్ట్ వీక్ షేర్ సాధించిన సినిమాగా ‘సాహో’ రికార్డులకెక్కింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలకు కలిపి ‘సాహో’ రైట్స్ రూ. 120 కోట్లకు మించిన ధరకు అమ్మారు. సినిమా లాభాల బాటలోకి వెళ్లాలంటే ఇంకా రూ. 50 కోట్ల వరకు షేర్ రాబట్టాల్సి ఉంది. కొన్ని ఏరియాల్లో నో రిటర్న్ అమౌంట్ బేసిస్‌లో రైట్స్ అమ్మారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు అంత మొత్తం వసూలు అవుతుందో లేదో అనే సందేహంలో ఉన్నారు. వరల్డ్ వైడ్ వసూళ్లు పరిశీలిస్తే…ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. అయితే షేర్ ప్రకారం చూసుకుంటే సినిమా పెట్టుబడి తిరిగి రావాలంటే ఇంకా భారీ మొత్తం వసూలు కావాల్సి ఉంది. మరి ఫుల్‌రన్‌లో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

 

మొత్తంగా సాహోకి వస్తున్న కలెక్షన్లు సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. కంటెంట్ లేదని విమర్శలు వచ్చినా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది సాహో. సినిమా బాగోలేదు అనే రివ్యూతో హర్ట్ అయిన ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్.. ఇప్పుడు కలెక్షన్ల వివరాలు చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దటీజ్ ప్రభాస్ స్టామినా అని గర్వంగా చెప్పుకుంటున్నారు. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. అని డైలాగులు వేస్తున్నారు.

Tags : bollywoodbox office collectionsdisasterflophitprabhasrecordsaahoTollywood

Also read

Use Facebook to Comment on this PostMenu