11/27/19 3:49 PM

చిరంజీవి ‘వీణ స్టెప్’ ను సల్మాన్ చేస్తున్నాడట!

salman khan and chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ఇంద్ర’ చిత్రంలోని.. ‘ధాయి దామ్మా పాట’లో వీణ స్టెప్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. లారెన్స్ కంపోజ్ చేసిన ఈ స్టెప్ ను చిరంజీవి అద్భుతమెన గ్రేస్ తో  చేసి తెలుగు సినీ ప్రేక్షకుల నీరాజనాలందుకున్నారు. తాజాగా ఈ క్లాసిక్ మూవెమెంట్ ను ను తనదైన శైలిలో వేసేందుకు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ‘దబాంగ్ 3’ లో కథానాయకుడిగా  సల్మాన్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కంపోజ్ చేసిన  ఓ పాటలో ఈ స్టెప్ ను రిక్రియేట్ చేస్తే బాగుంటుందని ప్రభుదేవా సూచించగా దానికి సల్మాన్ వెంటనే ఒప్పుకున్నాడట. ఆ రకంగా చిరంజీవి చేసిన స్టెప్ ను సల్మాన్ తన ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడన్నమాట. మరి, చిరంజీవి వీణ స్టెప్ కు సల్మాన్ ఎంత వరకు న్యాయం చేస్తాడో చూడాలి!

 

మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ లతో్ సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. సల్మాన్ ఖాన్ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా చిరంజీవి ఇంటినుంచే భోజనం వెళుతుంటుంది. ఇటీవల హిందీ ‘సైరా’ ట్రైలర్ ను సల్మాన్ తన సోషల్ మీడియాలో అకౌంట్లలో పోస్ట్ చేశాడు కూడా! డిసెంబర్ 20న క్రిస్‌మస్ కానుకగా విడుదల కానున్న దబాంగ్ 3 లో ‘ఈగ’ ఫేం సుదీప్ విలన్ గా నటిస్తున్నాడు.

Tags : chiranjeeviDabangg 3salman khanVeena Step

Also read

Use Facebook to Comment on this PostMenu