10/20/19 9:30 PM

కాపీ క్యాట్ అన్నారు : మరి ఇలా జరిగింది ఏంటి?

Samaja Vara Gamana Sets New Record1

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల…వైకుంఠపురములో..’. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ చాలా టైమ్ తీసుకుని చివరికి త్రివిక్రమ్ డైరెక్షన్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని తీవ్రంగా కష్టపడుతున్నారు. వెరైటీ సబ్జెక్టుతో ఈ సినిమా ఉంటుందని ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఇకపోతే ఈ సినిమాలోని ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా?’ సాంగ్ సెన్సేషనల్ గా మారింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా… ఈ సాంగ్.. మ్యూజిక్ లవర్స్ కి తెగ నచ్చేసింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా పాటకు రానన్ని వ్యూస్ ఈ పాటకు వచ్చాయి. యూ ట్యూబ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్, 313కే లైక్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఈ పాటకు 40 మిలియన్స్ వ్యూస్, 7 లక్షల లైక్స్ వచ్చాయి. తెలుగులో ఒక సాంగ్ కు ఇన్ని లైక్స్, వ్యూస్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. టాలీవుడ్ ఇండస్ట్రీలో సామజ వర గమన యూట్యూబ్ లో న్యూ రికార్డ్ సెట్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.

 

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ఈ పాటను రాశారు. తమన్‌ సంగీతం అందించగా సిద్ధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ‘‘కుర్రతనం.. తుంటరితనం.. కొంటెతనం ఉండే పాట రాయమని త్రివిక్రమ్ అడిగినప్పుడు కొన్ని క్లాసికల్‌ పదాలు రాయాలనిపించింది. అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్‌కు థ్యాంక్స్‌. బన్నీ ఏ పాత్రలో అయినా చక్కగా ఒదిగిపోగలడు. తమన్‌ మంచి సంగీతం అందించారు. శ్రీరామ్‌ బాగా పాడారు’’ అని సిరివెన్నెల అన్నారు. ‘‘బన్నీకి ఇప్పటివరకు 12 పాటలకు వర్క్‌ చేశాను. ఈ సారి కొత్తగా ఉండాలని ఈ పాటను రెడీ చేశాం. శాస్త్రిగారు అద్భుతమైన లిరిక్స్‌ ఇచ్చారు’’ అన్నారు తమన్‌.

 

కాగా.. ఈ సాంగ్ రిలీజ్ అయిన మరుక్షణమే సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని తెగ ట్రోల్ చేశారు. తమన్ కాపీ క్యాట్ అని నిందించారు. ప‌క్క భాష‌ల్లో హిట్టైన ట్యూన్స్ ను దొబ్బేసి మ్యూజిక్ ఇస్తాడని ఆరోపించారు. సామజవరగమన పాట‌ను ఎక్కడో విన్నట్లుంది అనే అనుమానాలు వ్యక్తం చేశారు. వరంగల్ టైమ్స్ అనే యూ ట్యూబ్ ఛానెల్ లో కుర్రాళ్లు సరదాగా చేసుకున్న ఓ పాటను థమన్ కాపీ కొట్టేసాడు అని చెప్పారు. ఈ కడలి అలల అంటూ సాగే ఈ పల్లవిని తీసుకొచ్చి తన పాటకు చరణంగా మార్చేడాని తమన్ ని ట్రోల్ చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు అదే సాంగ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో ట్రోల్స్ కారణంగా కొంత ఇబ్బందిగా ఫీల్ అయిన తమన్.. ఈ ఆదరణతో కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడట.

Tags : allu arjunlikesrecordSamaja Vara GamanasongTollywoodtrivikramviewsyoutube

Also read

Use Facebook to Comment on this PostMenu