11/22/18 8:13 PM

శరభ సినిమా రివ్యూ

Sarabha Movie Review

టైటిల్ : శరభ
జానర్ : సోషియో ఫాంటసీ, యాక్షన్ థ్రిల్లర్
తారాగణం : ఆకాష్‌ కుమార్‌, మిస్తీ చక్రవర్తి, జయప్రధ, నెపోలియన్‌, పొన్‌వన్నన్‌
సంగీతం : కోటి
దర్శకత్వం : ఎన్‌. నరసింహారావు
నిర్మాత : అశ్వనీ కుమార్‌ సహదేవ్‌

కథ:
ఓ క్షుద్ర మాంత్రికుడు..అతని శక్తులు మాయలతో కష్టాల్లో పడే హీరోయిన్…అతన్ని ఎదురించే తోట రాముడులాంటి హీరో…వీళ్ల మధ్య జరిగే విఠలాచార్య మార్క్ కథలు ఆ మధ్యన వచ్చేవి. అయితే ఈ మధ్యన ఎవరూ ధైర్యం చేయటం లేదు. కానీ కన్నడంలో శివరాజకుమార్ హీరోగా వచ్చి హిట్టైన భజరంగి ఆ ధైర్యాన్ని ఇచ్చింది. దాంతో తెలుగులో శరభ అనే సినిమా రూపొందించి ఈ శుక్రవారం (నవంబర్ 22) రిలీజ్ చేశారు. సూపర్ హిట్ సినిమా రీమేక్ కాబట్టి…కథ, కథనాలు బాగానే ఉంటాయి. అయితే మారుతున్న తెలుగు ప్రేక్షకుడుని ..క్షుద్ర శక్తులు, మాంత్రికుడు, బలి ఇవ్వటం వంటి కాన్సెప్ట్ నచ్చుతుందా..జయప్రధ లాంటి సీనియర్‌ నటి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం శరభకు కలిసొచ్చిందా? జయప్రధ రీ ఎంట్రీలో సత్తా చాటారా..? ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్‌ కుమార్‌ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? కొత్త డైరక్టర్ ..దర్శకత్వ ప్రతిభ ఎలా ఉంది..సినిమా ఆడుతుందా? వంటి విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

శరభ (ఆకాష్‌ కుమార్‌). తండ్రి లేకపోవటంతో ఎంత అల్లరి చేసినా, ఎన్ని తప్పులు చేసినా తల్లి పార్వతమ్మ (జయప్రధ) వెనకేసుకువస్తుంది. దాంతో మావ‌య్య చిన్నారావు(నాజ‌ర్‌), స్నేహితుడితో క‌లిసి జులాయిగా తిరుగుతుంటాడు. క్షుద్ర‌ మాంత్రికుడు చండ్రాక్ష (పునీత్ ఇస్సార్‌)కు శక్తి కోసం, తన క్షుద్ర సామ్రాజ్య స్దాపన కోసం ఆడవాళ్లను బలి ఇస్తుంటాడు. ఈ క్రమంలో తను అనుకున్న (18 మంది కావాలి) లెక్క ప్రకారం మరో బలి పెండింగ్ ఉంటుంది. అందుకు తగిన అమ్మాయి కోసం అన్వేషిస్తుంటాడు. అప్పుడు వాళ్ల కంట్లో దివ్య‌(మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి) పడుతుంది. ఆమె సెంట్రల్‌ మినిస్టర్(షియాజీ షిండే) కుమార్తె. పీడ కలలతో ఇబ్బంది పడుతుంటే… జాతక దోషాలు ఉన్నాయని శాంతి కోసం దివ్యను తండ్రి సిరిగిరిపురంలోని గురువు (పొన్‌వన్నన్‌) దగ్గర విడిపెట్టి వెళతాడు.

ఆ క్రమంలో గురువు దివ్యను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతను శరభ, పార్వతమ్మలకు అప్పగిస్తాడు. ఇక అక్కడ నుంచి శరభకు, దివ్యకు మధ్య చిన్న చిన్న గొడవలు మొదలై , ప్రేమతో ముగుస్తుంది. ఈ లోగా చండ్రాక్ష తన 18వ బలి కోసం దివ్యను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాన్ని శరభ అడ్డుకుంటాడు. ఆ క్రమంలో అతనికి తన గతం గురించి ఓ విషయం తెలుస్తుంది. ఆ కల ఏంటి? తమ సంరక్షణలో ఉన్న దివ్యని ఎలా కాపాడుకుంటాడు? ఆ మాంత్రికుడుని ఎలా ఎదిరించాడు..అసలు ఆ మాంత్రికుడు దివ్యనే బలికి ఎంచుకోవటం వెనక కారణం ఏమిటి..వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉంది..?
సాధారణంగా కన్నడ సినిమాలు మన తెలుగు సినిమాలకన్నా వెనకబడి ఉంటాయి. మనకు 80లలో వచ్చిన ఇలాంటి సినిమాలు ఇప్పటికీ అక్కడ వస్తున్నాయంటేనే అర్దం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా అక్కడ హిట్ అవ్వటానికి కారణం ఏదైనా..ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చాలా సీన్స్ చాలా మెలోడ్రామా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే సూపర్ న్యాచురల్ పవర్స్‌ని చూపెట్టిన విధానం ఆశ్చర్యంగానూ, వింతగా ఉంటుంది. క్షుద్రోపాసన చెయ్యటం, బలి ఇవ్వటం వంటివి నమ్మబుద్ది కావు. క్లైమాక్స్‌ని భారీగా చూపెట్టాలని చేసే విన్యాసాలు బోరింగ్‌గా మార్చేసాయి. కానీ నరసింహా స్వామి స్వయంగా వచ్చి విలన్‌ని అంతం చేసే సీన్‌ మాత్రం బాగుంది. అలాగే హీరో, హీరోయిన్స్ మద్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా అసలు పండలేదు. రిలీఫ్ కోసం ఫన్ కూడా పెద్దగా పెట్టలేదు.

నటీనటులు :
ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హీరో ఆకాష్‌ కుమార్‌ మెప్పించలేకపోయాడు. యాక్షన్ సీన్స్‌లో పరవాలేదనిపంచినా నటన పరంగా ఇంకా చాలా ఇంప్రూవ్‌ అవ్వాలి. హీరోయిన్‌ మిస్తీ చక్రవర్తి తన పరిధి మేరకు పరవాలేదనిపించింది. ఇక పార్వతమ్మ పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చిన జయప్రధ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. హీరో తల్లిగా హుందాగా కనిపించారు. చాలాకాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన పునీత్‌ ఇస్సార్‌, నెపోలియన్ లు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇతర పాత్రల్లో నాజర్‌, పొన్‌వన్నన్‌, చరణ్ దీప్‌ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ :
చాలాకాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓ సోషియో ఫాంటసీ కథను తీసుకువచ్చిన దర్శకుడు ఎన్‌ నరసింహారావు మెప్పించలేకపోయారు. సినిమాను ఇంట్రస్టింగ్ పాయింట్‌తో ప్రారంభించినా.. తొలి భాగం అంతా టైంపాస్‌ సన్నివేశాలతో లాగించేశారు. ముఖ్యంగా హీరో హీరోయిన్లు మధ్య వచ్చే సన్నివేశాలు బోర్‌కొట్టిస్తాయి. ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు మేకప్‌, గ్రాఫిక్స్‌ కీలకం. కానీ ఆ రెండు విషయాల్లో శరభ నిరాశపరుస్తుంది. క్లైమాక్స్‌లో నరసింహా స్వామి స్వయంగా వచ్చి రాక్షసున్ని అంతం చేసే సీన్‌ బాగుంది. సంగీతం కూడా ఆకట్టుకునేలా లేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి

రేటింగ్..1.5/5

Tags : Aakash kumardirector n narasimha raofantasy movieMishti ChakravartyNapoleon. jayapradaSarabha Movie Review RatingSayaji Shindesocio fantasy action thriller

Use Facebook to Comment on this PostMenu