01/23/19 9:24 PM

వెంకీ, వరుణ్‌లే కాదు మూడో హీరో కూడా యాడ్ అవుతున్నాడు

Sequel For F2, Ravi Teja As Blind

విక్టరీ వెంక‌టేష్, మెగా హీరో వ‌రుణ్ తేజ్‌లు హీరోలుగా సంక్రాంతి పండక్కి(జనవరి 12) వచ్చిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. వినయ విధేయ రామ, పేట, ఎన్టీఆర్ కథానాయకుడు తీవ్రంగా నిరాశపరిస్తే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఎఫ్ 2 మాత్రం బంపర్ హిట్ కొట్టింది. సంక్రాంతి అల్లుళ్లుగా వెంకీ, వరుణ్‌లు చేసిన ఫన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ వంద కోట్ల క్ల‌బ్‌కు చేరువైంది. ఎఫ్ 2 సినిమా చాలా ప్రాంతాల్లో రికార్డులను బద్దలుకొడుతోంది. వెంకటేశ్, వరుణ్‌ల కెరియర్‌లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ‘F2’ చిత్రానికి కొనసాగింపుగా.. ‘F3’ చిత్రాన్ని సీక్వెల్ తీయబోతున్నట్టు డైరెక్టర్ అనిల్ రావిపూడి అనౌన్స్ చేశారు.

 

వెంకటేష్, వరుణ్ తేజ్‌లతోనే ‘ఎఫ్ 2’ కి సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ రానుందని అనిల్ చెప్పాడు. అయితే కొత్త మార్పు ఏంటంటే ఈ ఇద్దరికీ మరో హీరోని యాడ్ చేయబోతున్నారట. అతడే మాస్ మహరాజ్ రవితేజ. ‘రాజా ది గ్రేట్’ తరహాలోనే ఈ సినిమాలోనూ రవితేజ అంధుడిగా కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ పాత్ర నుంచి కూడా నాన్ స్టాప్ నవ్వులు పూయించడానికి అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి క‌థ రాసే ప‌నిలో ప‌డ్డాడట. త‌మ‌న్నా, మెహ్రీన్‌తో పాటు మ‌రో హీరోయిన్‌ను కూడా ఎంపిక చేయ‌నున్నారని వార్తలు వస్తున్నాయి. ‘F3’లో మాస్ రాజా ఎంట్రీపై అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Tags : Anil ravipudif2 movief2 sequelf3 movieraja the greatravitejaraviteja blindVarun Tejvenaktesh

Also read

Use Facebook to Comment on this Post



Menu