07/13/18 6:35 PM

పవన్ కల్యాణ్ తో జరిగిన గొడవ నిజమే అని చెప్పిన కమెడియన్..!

Untitled-1 copy

తెలుగు కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతో క్రేజ్, పాపులారిటీ సంపాదించుకున్నాడు షకలక శంకర్. జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో వెండితెరపై ప్రయత్నాలు చేయడం, అవకాశాలు వెల్లువగా రావడంతో… చాలా సినిమాల్లో కమెడియన్ గా నటించడం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితులలో కమెడియన్లు హీరోగా మారుతున్న నేపథ్యంలో షకలక శంకర్ ‘శంభో శంకర’ సినిమాలో హీరోగా అవతారమెత్తాడు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ కోసం త్రివిక్రమ్, దిల్ రాజు, రవితేజలపై తనదైన స్టైల్ లో కామెంట్ చేశాడు శంకర్. దీంతో ఈ విషయం పెద్ద చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా గతంలో పవన్ కళ్యాణ్ తనను కొట్టిన విషయం గురించి ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో షకలక శంకర్ అసలు విషయం బయటకు చెప్పాడు.

 

అసలు ఆ సినిమాలో తనది చాలా చిన్న పాత్రేనని.. షూటింగ్ ఉన్నా లేకపోయినా.. పవన్ కళ్యాణ్ సెట్స్ లో ఉన్నారని తెలుసుకుని పవన్ చూడటానికి వెళ్లేవాడిని అని, పవన్ కళ్యాణ్‌ ని తనివి తీరా చూసేవాడిని అని తెలిపాడు.  75రోజుల పాటు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ ఆయన్ని ఎంత చూసినా తనివి తీరేది కాదన్నాడు. ” ఆ సినిమాలో తీసిన సీనే మళ్లీ మళ్లీ తీస్తుండేవాళ్లు.  సెట్‌ లో రోజు 700 నుంచి 800 వరకు ఉండేవాళ్లు. ఆ సినిమాకు పవన్ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో.. అనవసరంగా తీసిన షాటే మళ్లీ తీస్తూ బోల్డంత డబ్బు వేస్ట్ చేస్తున్నారని నాకు అనిపించింది. దాంతో నాకు చిర్రెత్తుకొచ్చి కో డైరెక్టర్ పై అరిచాను. తీసేది కరెక్ట్‌గా తీయమని చెప్పాను.  ఈ విషయం కాస్త పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లింది..దాంతో ఆయన నన్ను పిలిచి..’ఏరా అప్పుడే డైరెక్టర్ ను .. కో డైరెక్టర్ ను అనే రేంజ్ కి వచ్చేశావురా నువ్వు .. వాళ్లు ఎన్నిసార్లు తీస్తే నీకెందుకు .. నీకు అవసరమా? నీ హద్దుల్లో నువ్వుండు .. పనిచేసుకుని పో .. అర్థమైందా .. పో’ అన్నారు. ఆ రోజున జరిగింది ఇదే’ అంటూ స్పష్టం చేశాడు షకలక శంకర్.

Tags : jabardasthpawan kalyanpawan kalyan slap shankarShakalaka shankarshankar

Also read

Use Facebook to Comment on this Post



Menu