04/17/19 1:26 PM

చిరంజీవి ఫ్యాన్స్‌కి భారీ గుడ్ న్యూస్

Shankar To Direct Megastar Chiranjeevi

150వ సినిమాతో రీ ఎంట్రీ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి జోష్ మీదున్నారు. ‘ఖైదీ నెం 150’ సినిమా హిట్ కావ‌డం చిరులో ఉత్సాహం నింపింది. చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ‘సైరా’ సినిమా షూటింగ్‌తో క్ష‌ణం తీరిక లేకుండా ఉన్నారు. ‘సైరా’ అలా పూర్తవుతుందో లేదో వ‌ర‌స‌గా మ‌రో ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్స్ చిరు కోసం చూస్తున్నారు. ఇప్ప‌టికే ఆ సినిమాలు కూడా క‌న్ఫ‌ర్మ్ చేశారు చిరంజీవి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’ తర్వాత కొరటాల, త్రివిక్రమ్ ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి.

 

ఇప్పుడు మరో న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. భారీ సినిమాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నారనే వార్త ఇండస్ట్రీలో ప్రాధాన్యత సంతరించుకుంది. చిరు కెరీర్ లో ఇది 153వ సినిమా. దీనికి అల్లు అరవింద్ నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఒక సినిమా కోసం కథను సిద్ధం చేయమని నిర్మాత అల్లు అరవింద్.. శంకర్ కి చెప్పారట. తెలుగులో చిరంజీవి హీరోగా, తమిళంలో అజిత్ లేదా విజయ్ హీరోగా ఈ ప్రాజెక్టు చేసేలా చర్చలు జరిగాయట. శంకర్ విషయానికొస్తే ‘భారతీయుడు 2’ పనులతో బిజీగా ఉన్నారు. కొరటాల, త్రివిక్రమ్ తో ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత శంకర్ – చిరంజీవి ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.

 

శంకర్ దర్శకత్వంలో చిరంజీవి ఒక మెసెజ్ ఓరియండెట్ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. మరి వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కబోయే సినిమా టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. భారీ సినిమాల దర్శకుడు శంకర్, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో సినిమా అనే వార్త మెగా అభిమానుల్లో సంతోషం నింపింది. శంకర్ మొదటి సినిమా ‘జెంటిల్ మెన్’ సినిమా విడుదలైనప్పటి నుంచి చిరు.. శంకర్ దర్శకత్వంలో ఒక సినిమానైనా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఇదే ‘జెంటిల్‌మెన్’ సినిమాను హిందీలో చిరంజీవి.. మహేష్ భట్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో ‘ది జెంటిల్మెన్’గా రీమేక్ చేసారు. ఈ సినిమా హిందీలో నిరాశపరిచింది.

Tags : chiranjeeviKORATALA SIVAmegastarmovieproducer allu aravindshankarsye raaTollywood

Also read

Use Facebook to Comment on this Post



Menu