08/3/19 1:08 PM

తీవ్రంగా నిరాశపరిచిన ‘డియర్ కామ్రేడ్’

Shock For Vijay Devarakonda, Dear Comrade In Loss

వరుస విజయాలతో టాలీవుడ్ సెన్సేషనల్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ సక్సెస్ స్పీడ్ కి బ్రేకులు పడ్డాయి. డియర్ కామ్రేడ్ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. చూస్తుంటే.. ఈ సినిమాకి భారీ నష్టాలు తప్పేలా లేవు. విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా ‘డియర్‌ కామ్రేడ్’‌. విజయ్ దేవరకొండ కెరీర్ లో భారీ హిట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో డియర్ కామ్రేడ్ పైనా అంచనాలు పెరిగాయి. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో విజయ్ దేవరకొండ సక్సెస్ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. సాగతీత సన్నివేశాలు ఎక్కువ కావటం.. రివ్యూలు సరిగ్గా లేకపోవడంతో సినిమాకు వెళ్లేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలోనే చిత్రయూనిట్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా రీ ఎడిట్‌ చేసింది. అయినా పెద్దగా వర్క్‌ అవుట్ అవలేదు.

 

ఈ సినిమా తొలి మూడు రోజుల్లో 18 కోట్ల వసూళ్లు సాధించగా.. వీక్‌ డేస్‌లో మాత్రం పూర్తిగా కలెక్షన్లు తగ్గిపోయాయి. ఈ సినిమా కేవలం 21 కోట్ల వసూళ్లు మాత్రమే ఇప్పటివరకు రాబట్టింది. ఈ వారం రిలీజ్ అయిన రాక్షసుడు, గుణ 369 సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రాగా ఇక కామ్రేడ్ బిజినెస్ చేయడం కష్టమే అనే అభిప్రాయం ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

 

డియర్‌ కామ్రేడ్‌ మొత్తం 34 కోట్ల బిజినెస్‌ చేసింది. అంటే ఈ సినిమా సేఫ్‌ జోన్‌లోకి రావాలంటే కనీసం 34 కోట్ల వసూళ్లు రాబట్టుకోవాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పేలా లేవని విశ్లేషకులు అంటున్నారు. దాదాపు అన్నీ ఏరియాల్లో కామ్రేడ్‌ నష్టాలనే మిగల్చినట్లు టాక్. సంగీతం పరంగా మంచి మార్కులు కొట్టేసినా.. కథాకథనాల పరంగా మాత్రం ఆడియన్స్ అంచనాలను అందుకోలేక యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

 

ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 13.66 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 20.49 కోట్ల షేర్ ను రాబట్టింది. 2వ వారంలో వసూళ్లు నిలకడగా ఉంటే, నష్టాల శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Tags : box-officecollectionsdear comradefloplossrashmika.vijay devarakona

Also read

Use Facebook to Comment on this Post



Menu