02/9/17 5:20 PM

యముడు ౩ (సింగం 3) మూవీ రివ్యూ

Suriya-Singam-3-Review-and-Ratings-Yamudu-3-Review

 

అసలు విడుదల అవుతుందా లేదా అంటూ పలు మార్లు వాయిదా వేసుకుంటూ వచ్చి అటు హీరో, దర్శకులతో పాటు ప్రేక్షకులకు కూడా అసహనం కలిగించిన సినిమా ‘సింగం 3’. సూర్య హీరోగా నటించిన ఈ మూవీ ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. కాని పోస్ట్ పోన్ పడే కొద్ది దీని మీద సాధారణ ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి తగ్గింది. కాని మాస్ మూవీ కాబట్టి బాగానే ఉంటుంది అనే అంచనాలతో బాగానే ఓపెనింగ్స్ తెచ్చుకుంది. సింగం సిరీస్ లో మొదటి రెండు సినిమాలు పెద్ద హిట్ కావడంతో దీని మీద హైప్ భీభత్సంగా ఉంది. సూర్య లాస్ట్ మూవీస్ అన్ని కమర్షియల్ గా పెద్దగ వర్క్ అవుట్ కాని కారణంగా ఫాన్స్ దీని మీద బోలెడు హోప్స్ పెట్టుకున్నారు. అనుష్కతో పాటు శృతిహాసన్ ని గ్లామర్ కోసం అదనంగా తెచ్చి పెట్టారు. మరి ఇన్ని ఒడిదుడుకుల మధ్య వచ్చిన ‘సింగం 3’ ఫైనల్ గా ఎలా ఉందో ఓ లుక్ వేద్దామా..

 

కథగా చెప్పుకుంటే

మంగళూరు పోలీస్ కమీషనర్ హత్యకు గురవుతాడు. కర్ణాటక పోలీసులు చేధించడం సాధ్యపడకపోవడంతో స్పెషల్ పర్పస్ మీద సిబిఐ ఆఫీసర్ నరసింహం (సూర్య) కు కేసు బాధ్యతలు అప్పగిస్తారు. దాని కోసం మంగళూరు వస్తాడు సింగం. అక్కడ వచ్చాక అక్కడి దాదాగిరి చెలాయిస్తున్న రెడ్డి (శరత్ సక్సేనా) ని దీని వెనుక ఉన్నట్టు గుర్తిస్తాడు. ఆ క్రమంలోనే పరిచయం అవుతుంది జర్నలిస్ట్ అగ్ని (శృతి హాసన్). సింగం విడాకులు తీసుకున్నాడని అనుకుని లవ్ చేస్తూ ఉంటుంది. కాని సింగం భార్య (అనుష్క) అదే ఊళ్ళో సైకిల్ కంపెనీ రన్ చేస్తూ ఉంటుంది. రెడ్డికి ఆస్ట్రేలియాలో ఉన్న విట్టల్ కి సంబంధాలు ఉన్నాయని పసిగట్టిన సింగం ఇక వేట మొదలుపెడతాడు. ఆ క్రమంలో ఆస్ట్రేలియా వెళ్లి ఛాలెంజ్ చేసి మరీ విట్టల్ ఇండియా వచ్చేలా చేస్తాడు. ఇక ఇక్కడికి వచ్చాక సింగం వీళ్ళందరి ఆట ఎలా కట్టించాడు అనేది మిగిలిన ఘట్టం.

 

నట సింహల గురించి

సింగం సిరీస్ లో ఇప్పుడు కాని భవిష్యత్తులో కాని సూర్య తప్ప ఇంకెవరిని ఇందులో ఊహించుకోలేము. అంత అద్భుతంగా నటించాడు. కఠినమైన దోషులతో డీల్ చేస్తున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ కి ఉండాల్సిన క్రూరత్వాన్ని తన ఎక్స్ప్రెషన్స్ తో  సూపర్బ్ గా పలికించాడు సూర్య. అక్కడక్కడ కొంచం ఓవర్ అనిపించినా సింగం ఫస్ట్ 2 పార్ట్శ్ ఆల్రెడీ చూసి ఒప్పుకున్నాం కాబట్టి ఇందులో చేసేది అంత అతి అనిపించదు. ఎయిర్ పోర్ట్ లో విదేశీ పోలీసులు తనను చుట్టుముట్టినప్పుడు, విట్టల్ దగ్గరికి వెళ్లి సవాల్ చేసినప్పుడు, రెడ్డిని అరెస్ట్ చేసి చంపేసే సీన్లో ఎక్కడికక్కడ నిజమైన పోలీస్ లాగే కనిపిస్తాడు సూర్య. అనుష్క గురించి ఎక్కువ చెప్పడానికి లేదు. బాగా బొద్దుగా తయారైన తనని సన్నగా చూపడం కెమెరామెన్ వల్ల కాలేదు. ‘బాహుబలి 2’లో తనని ఇలాగే చూడాలా అని అప్పుడే భయం వేస్తుంది. అవుట్ ఫిట్ పూర్తిగా కంట్రోల్ తప్పింది అనుష్క. గ్లామర్ కూడా మునుపటిలా లేదు. శృతి హాసన్ పాత్ర కథ కోసం వాడుకున్నా అనుష్క వల్ల వచ్చిన మైనస్ పాయింట్ ని తన గ్లామర్ తో కవర్ చేసే ప్రయత్నం చేసారు. ఇక రెడ్డిగా శరత్ సక్సేనా చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ లో బాగా మెప్పించాడు. విట్టల్ గా నటించిన కుర్రాడు ఠాకూర్ అనూప్ సింగ్ పర్వాలేదు అనిపిస్తాడు. ఆ పాత్రకు సూట్ అయ్యాడు. శరత్ బాబు, విజయ్ కుమార్, నాజర్, రాధా రవి, సుమన్, రాధిక అందరు అవసరానికి అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవారే. కాని వీళ్ళేవరికి ఓవర్ యాక్షన్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు హరి. అక్కడికి నయం.. కామెడీ చేసిన సూరి అంతగా ఇంప్రెస్ చేయలేదు.

 

టెక్నికల్ సింహల గురించి

దర్శకుడు హరి ఈసారి కూడా రిస్క్ తీసుకోకుండా సేం టెంప్లేట్ లోనే వెళ్ళిపోయాడు. ఒక ఊరు.. అందులో ఓ పోలీస్ ఆఫీసర్.. బలమైన లోకల్ గూండా.. వాడి వెనుక సూపర్ పవర్ ఉన్న ఓ విదేశీ పారిశ్రామిక వేత్త.. అంతే. ఇందులోనూ అలాగే వెళ్ళాడు. కాని చిన్న తేడా ఏంటంటే ఇందులో హీరో సినిమా మొత్తం పోలీస్ ఆఫీసర్ కాదు. ముప్పాతిక సినిమా సిబిఐ ఆఫీసర్ గా ఉంటాడు. తర్వాత కర్ణాటక పోలీస్ అవుతాడు. అంతే. కాని మాస్ పల్స్ బాగా తెలిసిన హరి తనకు తెలిసిన విద్య ఇంకాస్త స్కిల్ ఉపయోగించి మెరుగ్గా తీసే ప్రయత్నం చేసాడు తప్ప కొత్తగా అయితే కాదు. విపరీతమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆ టార్గెట్ ఆడియన్స్ ని ఫుల్ గా మెప్పిస్తాడు కాని రెగ్యులర్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఇదంతా కొరుకుడుపడని వ్యవహారమే. కాని బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించడంలో హరి బాగానే సక్సెస్ అయినా చివరి అరగంట మాత్రం శృతి తప్పదు. డోస్ సరిపోలేదు అనుకున్నాడో ఏమో హీరోయిజం హద్దులు దాటి అతిశయోక్తిని చూపించింది. ఫ్లైట్ ని జీప్ తో చేజ్ చేసి పట్టుకోవడం దీనికి పరాకాష్ట. మ్యూజిక్ ఇచ్చిన హరీష్ జైరాజ్ అంతగా ఆకట్టుకోడు. దేవి నే రైట్ ఛాయస్ అని మరోసారి ప్రూవ్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ అంత ఎఫెక్టివ్ గా లేదు. కెమెరామెన్ ప్రియాన్ వర్క్ మాత్రం మెచ్చదగిందే. చాలా కష్టపడ్డాడు. విజయన్, జయ్ ల ఎడిటింగ్ మాత్రం ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. 20 నిమిషాల సినిమాని ట్రిమ్ చేసుండాల్సింది. అనవసరం అనిపించే ట్రాక్స్ చాలా ఉన్నాయి. జ్ఞానవేల్ రాజ నిర్మాణం మాత్రం టాప్ రేంజ్ లో ఉంది. తన కుటుంబ సభ్యుడి సినిమానే కాబట్టి ఎక్కడ రాజీ అన్న ప్రశ్నే తీసుకురాలేదు. దాదాపు వైజాగ్ లోనే షూట్ చేయటం వల్ల నేటివిటీ ప్రోబ్లం రాలేదు.

 

సినిమాలో ఘర్జించినవి

సూర్య నటన

హరి టేకింగ్ ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో

బోర్ కొట్టని కథనం

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

 

సినిమాలో సౌండ్ రానివి

లెంగ్త్ ఎక్కువ కావడం

సెకండ్ హాఫ్ కాస్త రెగ్యులర్ గా ఉండటం

కామెడీ పూర్తిగా మిస్ అవ్వటం

పాటలు

 

చివరిగా సింగం మాట

సింగం సిరీస్ కి మీరు వీరాభిమానులు అయితే ‘సింగం 3’ మిమ్మల్ని ఏ మాత్రం నిరుత్సాహ పరచదు. మంచి యాక్షన్ మాస్ మసాలాగా బోర్ కొట్టకుండా తీసినందుకు హరిని అభినందించాలి. సూర్య తన ఫెరోషియస్ యాక్టింగ్ గ్రేస్ తో సినిమాని చివరి దాకా కాపాడుకుంటూ వచ్చాడు. పోలీస్ మీద గౌరవం పెంచేలా ఉందీ సినిమా. కాని కొత్తదనం మాత్రం ఆశించడానికి అవకాశం ఇవ్వలేదు హరి అండ్ సూర్య. తమ సినిమాలో ఏముంటుందో ఫస్ట్ రెండు భాగాల్లోనూ దీని ట్రైలర్ లోను స్పష్టంగా చెప్పేసారు కాబట్టి అలా ప్రిపేర్ అయ్యి వెళ్తే నో ప్రాబ్లం. ఎంజాయ్ చేసి రావొచ్చు. అంతకు మించి ఇంతకు ముందెప్పుడు చూడని పోలీస్ కథను చూడాలి అనుకుంటే మాత్రం అర్జెంటుగా థియేటర్ కు పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు. పవర్ ప్యాక్ యాక్షన్ డోస్ కాస్త ఎక్కువ కావాలంటే మాత్రం సింగం వెయిట్ చేస్తున్నాడు మీ కోసం.

 

రేటింగ్ : 3/5

 

Suriya Singam 3 Review and Ratings (Yamudu 3 Review)

Tags : Anushka ShettyMovie ReviewRatingsshruti haasanSingam 3Singam 3 Review and Ratingssuriyayamudu 3

Also read

Use Facebook to Comment on this PostMenu