05/25/19 8:50 PM

”సీత”ని ఆదరించినందుకు థ్యాంక్స్

Sita Movie Director Teja Thanks To Audience

కాజల్ ప్రధాన పాత్రధారిగా దర్శకుడు తేజ రూపొందించిన ‘సీత’ ఈ నెల 24 థియేటర్లకు వచ్చింది. సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. సినిమా చూసిన వాళ్లంతా చాలా బాగుందని అంటున్నారు అని దర్శకుడు తేజ అన్నారు. కాజల్ బాగా చేసిందని అభినందిస్తున్నారు, బెల్లంకొండ శ్రీనివాస్ చాలా బాగా చేశాడని ప్రశంసిస్తున్నారని చెప్పారు. ఇంతకుముందు చేసిన సినిమాలతో బెల్లంకొండ శ్రీనివాస్ కి మాస్ హీరోగా మంచి క్రేజ్ వుందని, ఈ సినిమాలో ఆయనను పూర్తి భిన్నంగా చూపించానని తేజ తెలిపారు. దాంతో ఎలా రిసీవ్ చేసుకుంటారా అని టెన్షన్ పడ్డానని, కానీ అంతా ఆయన పాత్రలోని కొత్తదనాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారని తేజ ఆనందం వ్యక్తం చేశారు. అభిషేక్ అగర్వాల్ తనపై నమ్మకంతో ఈ సినిమాను రిలీజ్ చేశారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందని తేజ అన్నారు. ఈ విజయానికి కారకులైన ఆడియన్స్ కి ఆయన థ్యాంక్స్ చెప్పారు.
`నేనే రాజు నేనే మంత్రి` సినిమా ఇచ్చిన కిక్కుతో క‌మ‌ర్షియ‌ల్ గాడిలో మ‌ళ్లీ ప‌డ్డాడు తేజ‌. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో `సీత‌` సినిమా చేశారు. ఇందులోని `సీత కాదు శూర్ప‌ణ‌ఖ‌` అనే డైలాగ్ ఇప్ప‌టికే ఫేమ‌స్ అయింది. `ల‌క్ష్మీ క‌ల్యాణం`, `నేనే రాజు నేనే మంత్రి` త‌ర్వాత తేజ – కాజ‌ల్ కాంబినేష‌న్‌లో రూపొందింది ఈ సినిమా. రామ్ పాత్ర‌లో బెల్లంకొండ శ్రీ‌నివాస్ బాగానే న‌టించాడు కానీ.. స్వాతి ముత్యం త‌ర‌హా పాత్ర శ్రీనివాస్ కి అస్స‌లు సూట్ కాలేదేమో అనిపించింది. సీత పాత్ర‌లో కాజ‌ల్ బాగా న‌టించింది. నెగిటివ్ రోల్ లో ర‌ప్ఫాడించింది. ఇక సోనూ సూద్ అయితే మ‌రోసారి అదరగొట్టాడు. కామెడీ పండిస్తూనే విల‌నిజంతో ఆక‌ట్టుకున్నాడు.

Tags : Bellamkonda Srinivasdirector tejaKajal AgarawalsitaSonu sood

Also read

Use Facebook to Comment on this Post



Menu