06/6/19 3:28 PM

రెచ్చిపోయిన శ్రీరెడ్డి : పవన్ వీరభక్తుడిపై పచ్చి బూతులు

Sri Reddy Vulgar Comments On Shakalaka Shankar

కాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం సమయంలో తనకు వ్యతిరేకంగా మాట్లాడిన టాలీవుడ్ ప్రముఖుల్ని వరుసపెట్టి టార్గెట్ చేస్తోంది. వారిపై రివెంజ్ తీర్చుకుంటోంది. తీవ్రమైన వ్యాఖ్యలతో, బూతులతో రెచ్చిపోతోంది. కొన్ని రోజులు డైరెక్టర్‌ తేజపై వరుసగా బాంబులు పేల్చింది. ఆ తర్వాత సీనియర్ నటుడు మురళీ మోహన్‌‌పై విరుచుకుపడింది. అనారోగ్యంతో (వెన్ను సర్జరీ) ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మురళీ మోహన్‌పై నోరు పారేసుకుంది. వంకర మాటలు మాట్లాడితే.. దేవుడు అన్ని వంచేస్తాడంటూ శాపనార్థాలు పెట్టింది. ఇప్పుడు హాస్య నటుడు కమ్ హీరో.. పవన్ కళ్యాణ్ వీర భక్తుడు షకలక శంకర్ పై శ్రీరెడ్డి చూపు పడింది. శంకర్ పై బూతుల వర్షం కురిపించింది.

 

పవన్ కళ్యాణ్ అంటే శ్రీరెడ్డికి ఎంత కోపమో చెప్పాల్సిన పని లేదు. కేవలం ఆయనఫై మాత్రమే కాదు ఆయనను అభిమానించే సినీ స్టార్స్ నూ టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే పలువురిఫై కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి తాజాగా కమెడియన్ నుండి హీరోగా మారిన ష‌క‌ల‌క శంక‌ర్‌పై దారుణమైన కామెంట్స్ చేసింది. ఎన్నికల ముగిసిన తర్వాత గుడ్డు పెట్టే కోడిలాగా గంపకింద దాక్కున్నాడు అంటూ షకలక శంకర్‌ను ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టింది. శంకర్ ను ఉద్దేశించి బూతులు తిట్టింది. శంకర్ ను ఇలా తిట్టడానికి కారణం లేకపోలేదు. ఆ మ‌ధ్య ఓసారి త‌న సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా శ్రీరెడ్డిని ఉద్దేశించి శంకర్ పరోక్షంగా విమర్శలు చేశాడు. దాంతో ఇప్పుడిలా రివెంజ్ తీర్చుకుంటుంది శ్రీరెడ్డి.

 

నన్ను తిట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో అనుభవిస్తున్నారు పాపం.. అంటూ శ్రీరెడ్డి రెచ్చిపోతోంది. దేవుడు అనే వాడు ఒకడున్నాడు కర్మ తిరిగి అప్ప చెప్పటానికి అని వేదాంతం వల్లిస్తోంది. మురళీ మోహన్ తన తల్లి అస్థికలు గంగలో కలిపేందుకు అలహాబాద్, వారణాసి వెళ్లి అక్కడ అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించగా.. వెన్నెముకలో సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో మురళీమోహన్ కొన్ని రోజుల క్రితం సర్జరీ చేయించుకున్నారు. మొత్తంగా శ్రీరెడ్డి తీరు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. శ్రీరెడ్డి వైఖరిపై సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. అన్ని రోజులూ ఒకలా ఉండవని అంటున్నారు.


Tags : director tejamurali mohanpawan kalyanShakalaka shankarsri reddy.

Also read

Use Facebook to Comment on this Post



Menu