05/17/18 7:51 PM

పవన్ అభిమానుల మీద చెలరేగిపోయిన శ్రీరెడ్డి..!

Untitled-1 copy

తెలుగు సినిమారంగంలో క్యాస్టింగ్ కౌచ్ విషయంలో సినిమా దర్శకులు, నిర్మాతలపై సంచలన కామెంట్స్ చేసిన నటి శ్రీరెడ్డి.. జనసేనాని పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో ఈ విషయం మీడియాలో పెద్ద ఇష్యూ అయింది. అప్పటిదాకా శ్రీరెడ్డి కి మద్దతు తెలిపిన ప్రముఖులు.. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలతో.. ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నారు.

 

ఈ పరిణామంతో మీడియా కూడా శ్రీరెడ్డిని లైట్ తీసుకుంది. శ్రీరెడ్డి కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కొంతకాలం సోషల్ మీడియా ద్వారా కొన్ని పోస్టింగ్ లతో హల్ చల్ చేసింది. అయితే తాజాగా పోలీస్ స్టేషన్ లో దర్శనమిచ్చింది శ్రీరెడ్డి. అందుకు కారణం.. గతంలో పవన్ కళ్యాణ్ ని తిట్టినందుకు పవన్ అభిమానులు సోషల్ మీడియాలో శ్రీరెడ్డి చేసిన కామెంట్సే.

 

నేను ఎయిడ్స్ వ్యాధితో చనిపోయానని, ఆత్మహత్య చేసుకున్నానని పోస్టింగ్‌ లు పెడుతున్నారని శ్రీరెడ్డి మండిపడింది. తనపై కక్ష సాధించేందుకు కావాలనే కొంత మంది ఇలా చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనపై పోస్టులు చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి సీసీఎస్ సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆడపిల్లలంటే ఆకతాయిగా ఉందా? తాటతీస్తా ఒక్కొక్కరికి అంటూ పరుష పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది శ్రీరెడ్డి.

Tags : casting couchjanasenapawan kalyanpawan kalyan fanspolice stationsri reddy.srireddy lodges complaint

Also read

Use Facebook to Comment on this Post



Menu