10/20/18 10:27 PM

సీనియర్ నటుడిపై శృతి సంచలన ఆరోపణలు

sruthi hariharan on arjun

మీ టూ ఉద్య‌మం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. సినీ, క్రీడ, రాజకీయం.. ఇలా అన్ని రంగాల‌లో లైంగిక వేధింపుల పర్వం బయటపడుతోంది. ముఖ్యంగా సినీ రంగంలో ఈ వేధింపులు ఎక్కువుగా వెలుగుచూస్తున్నాయి. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా ప‌లువురు నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లను బయటపెడుతున్నారు.

 

మరీ ముఖ్యంగా మీ టూ ఉద్యమం కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. తమిళ కవి వైరముత్తు‌కు మీ టూ మరక అంటుకుంది. గాయని చిన్మ‌య శ్రీ‌పాద, గాయని హేమ‌మాలిని వైరిముత్తు నిజస్వరూపం ఇదే అంటే బాంబు పేల్చారు.

 

తాజాగా సీనియర్ నటుడు, యాక్ష‌న్ కింగ్ అర్జున్ సైతం మీ టూ సుడిగుండంలో చిక్కుకున్నారు. అర్జున్ పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అర్జున్ తో న‌టించిన కన్నడ హీరోయిన్ శృతి హరిహరణ్ మీ టూ వేదిక‌గా గ‌ళం విప్పింది. అర్జున్ పై సంచలన ఆరోపణలు చేసింది. అర్జున్ తో విస్మయ అనే ద్విభాషా చిత్రంలో నటించే సమయంలో త‌న‌ను అనవసరంగా హగ్ చేసుకున్నాడని ఆరోపణలు చేసింది. రొమాంటిక్ సీన్ కోసం రిహార్సల్స్ చేస్తుండగా అర్జున్ తన చేతులను నా వీపుపై వేసి గట్టిగా హగ్ చేసుకుంటూ.. సీన్ ఇలా చేస్తే బాగుంటుందని దర్శకుడితో చెప్పాడని శృతి తెలిపింది. అర్జున్ చర్యతో తాను షాక్ తిన్నానని.. వెంటనే తేరుకుని.. ఒక నటి అనుమతి తీసుకోకుండా అలా చేయడం తప్పని గట్టిగా విదిలించుకుని అక్కడినుంచి బయటకు వచ్చినట్టు తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది శృతి. ప్రమోషన్స్ సమయంలో కూడా ఇలాగే చేసినట్టుగా ఆమె ఆరోపించింది. అయితే ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పే దైర్యం అప్పట్లో తనకు లేకపోయిందని శృతి తెలిపింది. మీ టూ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన శృతి.. .లైంగిక వేధింపులకు గురైన అందరూ తమ చేదు అనుభవాన్ని బయటపెట్టాలని సూచించింది.

 

Tags : arjun sarjakannada actressmee toosensational allegationsSexual HarassmentSruthi hariharan

Also read

Use Facebook to Comment on this Post



Menu