11/26/19 12:58 PM

‘బాహుబలి’ని తలదన్నేలా ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం రాజమౌళి హాలీవుడ్ ప్లాన్స్‌!

rrr

 

 

దర్శక దిగ్గజం ఎస్‌.ఎస్  రాజమౌళి తన తదుపరి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ను  బాహుబలిని మించిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. ‘బాహుబలి పార్ట్-1 , పార్ట్-2’ లను తలదన్నేలా ఈ సినిమాను విడుదల చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి పార్ట్-1, పార్ట్ -2’ లను పలు భారతీయ భాషలతో పాటు అనేక విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘ఆర్‌ఆర్ఆర్’ ను కూడా అనేక విదేశీ భాషలతో పాటు  హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాలని రాజమౌళి యోచిస్తున్నట్లు సమాచారం.

 

ఇందు నిమిత్తం, ‘ఆర్ఆర్ఆర్’ ను ఇతర భాషలతో పాటు ఇంగ్లీష్ లోకి  డబ్ చేసి.. ఏదైనా ప్రముఖ హాలీవుడ్ స్టూడియోతో ఒప్పందం కుదుర్చుకుని.. సదరు సంస్థ ద్వారా ఆ సినిమా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని రాజమౌళి అనుకుంటున్నారట. సింపుల్ గా చెప్పాలంటే.. ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలు నిర్మించే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి రిలీజ్ ఉంటుందో అటువంటి గ్రాండ్ రిలీజ్  ‘ఆర్ఆర్ఆర్’ కు కూడా జరగాలని జక్కన్న కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన సినిమాలకు పని చేస్తున్న పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు ద్వారా త్వరలోనే రాజమౌళి హాలీవుడ్ స్టూడియోస్ తో సంప్రదింపులు జరపాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే , ‘ఆర్‌ఆర్‌ఆర్’ హాలీవుడ్ లో కూడా హల్‌చల్ చేయడం ఖాయమనే చెప్పవచ్చు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కోతోన్న ఈ చిత్రంలో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే!

Tags : Hollywood release for RRRNTR jrprabhasramcharanrrrSS Rajamouli

Also read

Use Facebook to Comment on this PostMenu