05/17/18 5:31 PM

ఉదయ్ కిరణ్ బయోపిక్ అంటే భయపడిపోతున్న ఆ కుటుంబం..!

Untitled-1 copy

టాలీవుడ్ కుర్ర హీరోలలో ఉదయ్ కిరణ్ స్వతహాగా కష్టపడి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల చేతిలో సినిమాలు లేకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. దర్శకుడు తేజ.. తన మొదటి సినిమా ‘చిత్రం’లో ఉదయ్ కిరణ్ కి అవకాశం ఇచ్చాడు. తర్వాత ‘నువ్వు నేను’ సినిమా తో హీరో ఉదయ్ కిరణ్ ని స్టార్ హీరో చేశాడు. తాజాగా ఉదయ్ కిరణ్ బయోపిక్ సినిమా చేయాలనుకుంటున్నాడు డైరెక్టర్ తేజ. దీంతో ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది.

 

ఉదయ్ కిరణ్ బయోపిక్ అంటే కచ్చితంగా అందులో మెగా కాంపౌండ్ ఎపిసోడ్ ఉండాల్సిందే. స్టార్ హీరోగా ఉన్న ఉదయ్ కిరణ్ కి మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుశ్మిత‌తో నిశ్చితార్థం జ‌ర‌గ‌డం, అటుపై కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ పెళ్లి ర‌ద్ద‌వడం ఉద‌య్ జీవితంలో కీల‌క మ‌లుపు. ఉద‌య్‌ పై అప్ప‌ట్లో ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం జరిగింది. అందులో వాస్త‌వం ఎలా ఉన్నా… ఆ క్ర‌మంలోనే మెగా ఫ్యాన్స్ అత‌డి సినిమాలు చూడ‌డం మానేశార‌న్న‌ది నిర్వివాదాంశం. ఆ ప్ర‌భావం ఉద‌య్ కెరీర్‌ పై తీవ్రంగా ప‌డింద‌ని విశ్లేషించారు కొంద‌రు.

 

అంతేకాకుండా ఉదయ్ కిరణ్ చనిపోకముందు చివరి ఇంటర్వ్యూ లో కూడా పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. సినిమా హీరో అయ్యాక కీలక సమయంలో తనకు  తెలియకుండానే తప్పులు జరిగిపోయాయి అని ఉదయ్ తన ఆవేదన వెళ్లబుచ్చాడు.

 

ఉదయ్ కిరణ్ చివరి రోజుల్లో చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పూర్తి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఇదే సమయంలో కుటుంబంలో కూడా గొడవలు చెలరేగడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో తేజ తీయబోయే బయోపిక్ సినిమాలో ఈ సన్నివేశాలన్నీ చూపించగలడా..? ముఖ్యంగా మెగా ఎపిసోడ్ ని లేకుండా బయోపిక్ చేయగలడా? అంటూ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నయి. ఒకవేళ ఈ మొత్తం ఎపిసోడ్ కలిపి ధైర్యంతో తేజ సినిమా తీస్తే…మెగా కాంపౌండ్ కుటుంబం స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Tags : chithramdirector tejamega familymega fans curiousnuvvu nennuTejateja to direct uday kiran biopicUday kiranuday kiran biopic

Also read

Use Facebook to Comment on this Post



Menu