10/4/19 9:20 PM

యంగ్ హీరోల ముందు చిరంజీవి నిలవలేరు అన్నవాళ్లకి ఇదే సమాధానం

Sye Raa Narasimha Reddy Collections

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి మూవీ.. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సుమారు రూ.250 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ.. అక్టోబర్ 2న విడుదలైంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి స్టామినా దీనికి తోడైంది. చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు నైజాం, సీడెడ్, ఆంధ్ర అనే తేడాలు ఉండవు.. ఎక్కడైనా ఫ్యాన్స్‌కి పూనకాలే. అయితే, సినిమాలకు గ్యాప్ ఇచ్చి చిరంజీవి రాజకీయాల వైపు వెళ్లడం.. సుదీర్ఘ విరామం తరవాత ఆయన మళ్లీ మేకప్ వేసుకోవడంతో ఆయనకు ఇప్పుడంత క్రేజ్ లేదని చాలా మంది అన్నారు.

 

మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి యంగ్ హీరోల ముందు ఆయన నిలవలేరు అన్నారు. కానీ, ఇప్పటికీ ఎప్పటికీ తనకు తిరుగులేదని మెగాస్టార్ మరోసారి నిరూపించారు. ‘ఖైదీ నంబర్ 150’తో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ‘సైరా’తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నాన్-బాహుబలి రికార్డులను తిరగరాస్తున్నారు.

 

తెలుగు రాష్ట్రాల్లో ‘సైరా’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజ్ అయిన కేవలం రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 47.6 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. అంటే, ఇంచుమించుగా అప్పుడే సగం మొత్తం వచ్చేసినట్టే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ కింద రూ.107.9 కోట్లకు ‘సైరా’ థియేట్రికల్ హక్కులను విక్రయించారు. దీనిలో సుమారు 44 శాతం రెండు రోజుల్లోనే వసూలైపోయింది. ప్రస్తుతం ‘సైరా’కు ఉన్న పాజిటివ్ టాక్ ప్రకారం మిగిలిన మొత్తం వసూలు కావడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శని, ఆదివారాల్లో వీకెండ్ కాబట్టి కలెక్షన్లు కచ్చితంగా ఊపందుకుంటాయని చిత్ర యూనిట్ ఆశిస్తోంది.

 

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ‘సైరా’ దూసుకుపోతోంది. యూఎస్‌లో రెండు రోజుల్లో 1.27 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా షేర్ వివరాలు
నైజాం – రూ. 12.08 కోట్లు
సీడెడ్ – రూ. 7.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 6.28 కోట్లు
గుంటూరు – రూ. 5.73 కోట్లు
తూర్పుగోదావరి – రూ. 5.30 కోట్లు
పశ్చిమ గోదావరి – రూ. 4.36 కోట్లు
కృష్ణా – రూ. 3.75 కోట్లు
నెల్లూరు – రూ. 2.40 కోట్లు
ఏపీ, తెలంగాణ మొత్తం – రూ. 47.60 కోట్లు

 

సైరా మూవీకి లభిస్తున్న ఆదరణ చూసి చిరంజీవి, రాం చరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. భారీ బడ్జెట్ మూవీ కావడంతో ముందు భయపడ్డారు. రిజల్ట్ ఏ విధంగా ఉంటుందోనని కంగారు పడ్డారు. కట్ చేస్తే.. అనూహ్యమైన స్పందన లభించింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు ఊహించని రీతిలో ఉన్నాయి. దీంతో అంతా హ్యాపీగా ఉన్నారు.

Tags : box office collectionschiranjeevimega starram charansurender reddySye raa narasimha reddy

Also read

Use Facebook to Comment on this PostMenu