10/3/19 9:44 PM

సైరా నరసింహారెడ్డి ప్రభంజనం

Sye Raa Narasimha Reddy Movie Collections

భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో(రూ.350 కోట్లు) తెరకెక్కిన సినిమా సైరా నరసింహారెడ్డి. అక్టోబర్ 2న విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.51.88 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన రెండో సినిమాగా రికార్డును సొంతం చేసుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూడో తెలుగు సినిమాగా, సౌత్ ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సొంతం చేసుకున్న 5వ సినిమాగా సైరా రికార్డులు సృష్టించింది. రిలీజ్‌కి ముందు ఎంత హైప్ ఉందో రిలీజ్ తర్వాత కూడా అంతే బజ్ ఉంది. ఈ సినిమాకి యునానిమస్‌గా పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో అన్ని సర్క్యూట్స్ లోనూ భారీ కలెక్షన్స్ రాబట్టింది.

 

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 37.60 కోట్లు షేర్ రాబట్టింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత షేర్ అంటే ఇంకా మిగిలిన చోట్ల ఎంత తక్కువ కలెక్షన్స్ వేసుకున్నా కూడా 15 కోట్ల షేర్ అనేది మాత్రం గ్యారంటీ. అంటే మొదటిరోజు షేర్ వేల్యూ గానే 50 కోట్లు రాబట్టాడంటే మెగాస్టార్ స్టామినా ఏంటి అనేది అర్ధమవుతుంది. పైగా ఇది మిడ్ వీకెండ్ రిలీజ్ కాబట్టి ఈ రోజు కాస్త కలెక్షన్స్ తగ్గడం అనేది కామన్. కానీ మళ్ళీ ఫస్ట్ షోల నుండి కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ అనేవి కామన్. మల్టీప్లెక్స్ బుకింగ్స్ అయితే ఆదివారం వరకు ఆల్మోస్ట్ ఫుల్ అని చూపిస్తున్నాయి. సీట్స్ మిగిలినా కూడా ఒక 10 పెర్సెంట్ మాత్రమే ఉన్నాయి. అంటే రేపటి నుండి కూడా ఈ సినిమా కలెక్షన్స్ మరింత ఊపందుకోనున్నాయని అనేది సినీ వర్గాల అంచనా.

 

ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే బాహుబలిని దాటి బాహుబలి-2 తర్వాత సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. సో, ఈ వారాంతానికి వచ్చే కలెక్షన్స్‌తో సైరా సేఫ్ జోన్ లోకి వచ్చేసేలా కనిపిస్తుంది. మధ్యలో చాణక్య రిలీజ్ అవుతున్నా పెద్ద ఎఫెక్ట్ అవ్వాల్సిందే కానీ దానివల్ల ఇది ఎఫెక్ట్ కాదు. అందుకే బ్లాక్ బస్టర్ అనిపించుకున్న మెగాస్టార్ బొమ్మ కొనుకున్నవాళ్లందరికి కూడా ప్రాఫిట్స్ అందించడం కూడా ఫిక్స్. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాని షేర్ బేసిస్ మీద ఓన్ రిలీజ్ చేసుకోవడం వల్ల నిర్మాతలకు కూడా కాసులపంట ఖాయం అంటున్నారు.

 
మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో రామ్ చరణ్ నిర్మించాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మెగా ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఫీస్ట్ అని చెప్పొచ్చు. టాలీవుడ్‌లో బాక్స్ ఆఫీస్ బాద్ షా గా వెలుగుతున్న చిరంజీవి.. ఈ సినిమాతో మరోసారి తన సత్తాను చాటాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు.

Tags : box office collectionschiranjeeviram charanrecordssurender reddySye raa narasimha reddy

Also read

Use Facebook to Comment on this PostMenu