11/29/18 1:17 PM

సినీ పరిశ్రమలో విషాదం.. ఉరేసుకుని సినీ నటి ఆత్మహత్య

Tamil film actress hangs herself at her residence

కోలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. వర్ధమాన నటి రియామిక(26) ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బుధవారం సాయంత్రం ఆమె సోదరుడు ప్రకాశ్‌ ఇంటికి చేరుకునేసరికి లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో బలవంతంగా తలుపు తెరిచి చూడగా రియామిక తన బెడ్‌రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. భయాందోళన చెందిన ప్రకాష్ వెంటనే ఇతర కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.

 

రియామిక, తన సోదరుడు ప్రకాశ్‌తో కలిసి గత నాలుగు నెలలుగా వలసారవాకంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. ఉన్నత చదువులు చదివిన ఆమె సినిమాలపై ఆసక్తితో సినీరంగంవైపు వచ్చింది. పలు తమిళ చిత్రాల్లో నటించిన రియామిక.. కుద్రతైల్ కుమారాం కొందత్తం, అఘోరి యనిట్టం ఆరంభం వంటి సినిమాల్లో కథానాయికిగా మెప్పించింది.

Tags : actress riyamikka suicideat her residencechennaihangs herselfriyamikkaTamil film actress

Also read

Use Facebook to Comment on this Post



Menu