06/16/19 9:19 PM

టాలీవుడ్ హీరోలను వెంటాడుతున్న ప్రమాదాలు : మరో హీరోకి గాయాలు

Tollywood Heros Accidents.. Sharwanand Injured

మొన్న నాగశౌర్య, నిన్న సందీప్ కిషన్, నేడు శర్వానంద్.. టాలీవుడ్ హీరోలను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. షూటింగ్ లో హీరోలు గాయపడుతున్నారు. షూటింగ్ లో కుర్ర హీరోలు నాగ శౌర్య, సందీప్ కిషన్ లకు గాయాలైన ఘటనలు మర్చిపోక ముందే మరో కుర్ర హీరో గాయపడ్డాడు. హీరో శర్వానంద్ కు గాయాలయ్యాయి. 96 సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. థాయ్ లాండ్ లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా శర్వానంద్ గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో శర్వానంద్ కాలు, భుజానికి గాయాలు అయ్యాయి. దీంతో శర్వా థాయ్ లాండ్ ను హైదరాబాద్ చేరుకున్నాడు.

 

షూటింగ్‌లో భాగంగా శ‌ర్వానంద్ థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ట్రైన‌ర్స్ ఆధ్వర్యంలో 2 రోజులు ప్రాక్టీస్ చేశాడు. మూడో రోజు ప్రాక్టీస్‌లో నాలుగు సార్లు సేఫ్‌గా ల్యాండ్ అయ్యాడు. ఐదోసారి ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో గాలి ఎక్కువ‌గా రావ‌డంతో ల్యాండింగ్ స‌మ‌యంలో ఇబ్బందులు ఎదుర‌య్యాయి. కాళ్లపై ల్యాండ్ కావాల్సిన వ్యక్తి భుజాల‌ను మోపి ల్యాండ్ అయ్యాడు. దాంతో షోల్డర్ డిస్ లొకేట్ అయ్యింది. కాలు కూడా స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యింది. హైదరాబాద్ కి వచ్చిన శర్వా.. ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా సన్ షైన్ హాస్పిట‌ల్‌లో చేరాడు. శ‌ర్వాను ప‌రీక్షించిన డాక్టర్లు భుజానికి బ‌ల‌మైన గాయం త‌గిలింద‌ని, సర్జరీ అవ‌స‌రమ‌ని సూచించారు. సోమ‌వారం ఈ శ‌స్త్ర చికిత్స జ‌రగ‌నుంది. స‌ర్జరీ త‌ర్వాత క‌నీసం 4 రోజులు ఆసుపత్రిలోనే ఉండాల‌ని వైద్యులు సూచించారు.
టాలీవుడ్ హీరోలను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు గాయాలపాలవుతున్నారు. వైజాగ్‌లో జరుగుతున్న షూటింగ్‌లో హీరో ‘నాగ శౌర్య’ గాయపడ్డాడు. కర్నూలులో ‘తెనాలి రామకృష్ణ’ చిత్రం షూటింగ్ లో హీరో సందీప్ కిషన్ గాయపడ్డాడు. ఫైట్ మాస్టర్ పొరపాటుతో బాంబ్ బ్లాస్ట్‌లో సందీప్‌కు గాయమైంది. టాలీవుడ్ యువ హీరోలు వరుసగా గాయపడుతుండటం చర్చనీయాంశంగా మారింది. అసలేం జరుగుతోంది అర్థం కాక అభిమానులు వర్రీ అవుతున్నారు. టాలీవుడ్ యువ హీరోలకు ఏదైనా దోషం పట్టుకుందా అనే డిస్కషన్ జరుగుతోంది. శాంతి పూజలు చేయించాలేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

RRR షూటింగ్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు గాయాలైన సంగతి తెలిసిందే.. చాణక్య మూవీ షూటింగ్‌లో సీనియర్ హీరో గోపిచంద్ సైతం గాయపడ్డాడు. అంతకుముందు డియర్ కామ్రేడ్ షూటింగ్ సమయంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గాయపడ్డాడు. అక్కడి నుంచి టాలీవుడ్ లో గాయాల పరంపర స్టార్ట్ అయిందని చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా కారు ప్రమాదం నుంచి మెగా హీరో వరుణ్ తేజ్ సేఫ్ గా బయటపడిన సంగతి తెలిసిందే. వరుస ప్రమాదాలపై టాలీవుడ్‌లో కలకలం రేగింది.

Tags : 96 movieaccidentsherosNaga ShouryaSandeep kishansharwanandTollywoodVarun Tej

Also read

Use Facebook to Comment on this Post



Menu