01/25/18 7:40 PM

దుమ్మురేపుతున్న టచ్ చేసి చూడు ట్రైలర్

Untitled-1 copy

మాస్ మహారాజా రవితేజ.. విక్రమ్ సిరికొండ డెబ్యూ డైరెక్టర్ గా తెరకెక్కించిన మూవీ ‘’టచ్ చేసి చూడు’’. ‘రాజా ది గ్రేట్’ చిత్రం తర్వాత రవితేజ నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. 2 నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ దుమ్మురేపుతోంది. ఎప్పటి మాదిరిగానే డైలాగ్స్ లో తన స్పీడ్‌ ని కంటిన్యూ చేశాడు రవితేజ. ఓ వైపు పోలీసుగా కనిపిస్తూనే.. మరోవైపు అధికారులను ప్రశ్నిస్తూ అదరగొట్టేశాడు. ఇందులో రవితేజ ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ రోల్ చేస్తున్నట్టు తేలిపోయింది.

 

‘యూనిఫాంలో ఉంటే ఆరే బుల్లెట్లు. యూనిఫాం తీసేస్తే రాయితో చంపుతానో రాడ్డుతో చంపుతానో నాకే తెలీదు’ అంటూ ఖాకీ డ్రెస్‌ లో పవర్ ఫుల్ డైలాగులు విసురుతూ వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

 

రౌడీ మూకను చెదరగొడుతున్న ఖాకీ సార్ గా రవితేజ పెర్ఫామెన్స్ కి కాంప్లిమెంట్లు కూడా పడిపోయాయి. ఇంతకంటే కీలక విషయం ఏమిటంటే.. ఈ మూవీ మొత్తం పాతబస్తీ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతుందట! ఓల్డ్ సిటీలోని ఒక పెద్ద పొలిటీషియన్ టార్గెట్ గా రవితేజ పెర్ఫామెన్స్ నడుస్తుందని, ఈ సీక్వెన్స్ లో కొన్ని సీరియస్ పొలిటికల్ డైలాగ్స్ కూడా పడతాయని తెలుస్తోంది. అసలే ఓల్డ్ సిటీ.. పైగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్.. దీనికి తోడు మహారాజా పంచ్ డైలాగ్స్ .. సినిమా మామూలుగా ఉండదని ఫ్యాన్స్ వెర్రెక్కిపోతున్నారు.

 

రవితేజ సరసన రాశి ఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ సంగీతాన్ని అందిస్తుండగా.. లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ లో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) వల్లభనేని వంశీ మోహన్ ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags : Raashi khannaRavi tejatheatrical trailertouch chesi chuduvikram sirikonda

Also read

Use Facebook to Comment on this Post



Menu