09/14/18 10:10 PM

పవన్ కల్యాణ్‌ కోసం అనుకున్న కథను ఆ హీరోతో చేస్తున్న త్రివిక్రమ్‌!

Untitled-1 copy

ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరక్టర్‌ త్రివిక్రమ్ ‘అరవిందసమేత’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ ను ఆయన విక్టరీ వెంకటేష్ తో చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, వాస్తవానికి ఈ సినిమా కథ పవన్ కల్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని తొలత త్రివిక్రమ్ రెడీ చేసుకున్నారట. కొంతకాలం క్రితం ఈ సబ్జెక్ట్ విన్న పవన్,  కథ తనకు బాగా నచ్చిందని.. సమయం కుదిరితే కచ్చితంగా చేద్దామని చెప్పాడట. అయితే, ‘అజ్ఞాతవాసి’ తర్వాత పవన్ కల్యాణ్  సినిమాలకు పూర్తిగా స్వస్తి చెప్సి రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ప్రస్తుతం ఈ కథను వెంకటేష్ తో చేయాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారు. ఆ మధ్యన త్రివిక్రమ్ వెంకీకి ఈ కథ చెప్పడం,  ఆయనకు బాగా నచ్చి ఈ సినిమా చేసేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.  ‘అరవింద సమేత వీర రాఘవ’  దసరా కానుకగా విడుదల కానుంది . ఈ ప్రాజెక్టు తరువాత త్రివిక్రమ్  వెంకటేష్ ప్రాజెక్ట్‌ పై దృష్టి పెట్టనున్నారు.  ప్రస్తుతం ‘ఎఫ్ 2’ సినిమా చేస్తోన్న వెంకటేశ్, ఆ తరువాత ‘వెంకీమామా’ చేస్తూనే త్రివిక్రమ్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. తన కెరీర్‌ తొలినాళ్లలో రచయితగా వెంకటేష్‌ తో ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ లాంటి ఆల్‌ టైమ్ ఫ్యామిలీ క్లాసిక్స్ ను అందించాడు త్రివిక్రమ్‌, వాస్తవానికి ఈ రెండు చిత్రాల ద్వారా రైటర్‌గా ఆయన గ్రాఫ్‌ తారా స్థాయికి వెళ్లిపోయింది. ఆ తర్వాత దర్శకుడిగా మారాక.. ఇన్నాళ్లకి వెంకటేష్ తో త్రివిక్రమ్‌ ఓ ప్రాజెక్ట్ చేస్తుండటం విశేషం!

Tags : Aravindha samethaAravindha sametha veera raghavaJr.NTRpawan kalyantrivikramvenkatesh

Also read

Use Facebook to Comment on this Post



Menu