04/13/19 7:52 PM

ఈ సినిమాతో అయినా ఆ హీరోల రాత మారేనా

two young heros in trivikram allu arjun movie

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అయ్యింది. వీరి కాంబోలో మూడో సినిమా రాబోతోంది. ఈ సినిమా ఈ రోజే పట్టాలెక్కింది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా శనివారం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ‘టబు’ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం ఇద్దరు యంగ్ హీరోలను తీసుకున్నట్టుగా సమాచారం.

 

ఆ ఇద్దరిలో ఒకరు నాగార్జున మేనల్లుడు సుశాంత్ అయితే, మరొకరు నవదీప్. హీరోగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సుశాంత్ కి హిట్ పడలేదు. ఇక నవదీప్ కి కెరియర్ ఆరంభంలో ఒకటి రెండు సక్సెస్ లు వచ్చినా, ఆ తర్వాత అవకాశాలే లేకుండాపోయాయి. అలాంటి ఈ హీరోలిద్దరకీ ఈ సినిమాలో అవకాశం రావడం విశేషం. అమాయక చక్రవర్తి పాత్రలో సుశాంత్ కనిపించనున్నాడట. నవదీప్ పాత్ర ఎలా ఉంటుందనేది తెలియాల్సి వుంది. మిగతా పాత్రల్లో రాజేంద్రప్రసాద్, సునీల్, రావు రమేశ్ కనిపించనున్నారట.

 

పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వైభవంగా సాగింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, నిర్మాత రాధాక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. తొలి షాట్‌కి బన్నీ క్లాప్ కొట్టగా అల్లు అరవింద్ కెమెరా ఆన్ చేశారు. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ కాంబోలో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరూ మూడోసారి జట్టుకట్టడం ఫ్యాన్స్ లో ఆనందం నింపింది. నాన్న సెంటిమెంట్‌తో మూడో సినిమా రాబోతోందట. ఈనెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

 

నా పేరు సూర్య తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ.. త్రివిక్రమ్‌తో సినిమా ప్రకటించగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘అరవింద సమేత’ చిత్రంతో హిట్ కసి తీర్చుకున్న త్రివిక్రమ్.. బన్నీకి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రంలో ‘అరవింద సమేత’ మ్యూజిక్ డైరెక్టర్‌ తమన్‌తో పాటు హీరోయిన్ పూజా హెగ్డేని రిపీట్ చేస్తున్నారు త్రివిక్రమ్.

Tags : allu arjunMUHURTHAMpooja hegdethird movietrivikram srinivas

Also read

Use Facebook to Comment on this Post



Menu