06/30/19 9:25 PM

మెగా హీరో రాంచరణ్ ఆఫీస్ ముందు ఆందోళన

Uyyalawada Narasimha Reddy Family Members Protest Infront Of Ram Charan Office

మెగా ఫ్యామిలీ హీరో, నిర్మాత రాంచరణ్ తేజ్ ఆఫీస్ ముందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తీసుకున్న సమయంలో తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని.. కానీ ఇప్పుడు కనీసం కలవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సెట్టింగ్‌లో తగలబడిన దాంట్లో తమ ప్రాపర్టీ కూడా ఉందని అన్నారు.

 

తమకు న్యాయం చేస్తానని రామ్‌చరణ్ మాట ఇచ్చారని.. ఇప్పుడేమో మరోలా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు చేశారు. సినిమా కోసం తమ కుటుంబసభ్యుల అనుమతి తీసుకొని ఆర్థిక సాయం చేస్తామని రాంచరణ్ హామీ ఇచ్చారని.. ఇప్పుడు.. గేటు లోపటికి కూడా రానివ్వడం లేదని ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు వాపోయారు. సినిమా కథ కోసం తమ ఇళ్లకు వచ్చి తమ ప్రాపర్టీలను సైతం షూటింగ్ కోసం వాడుకున్నట్లు చెప్పారు. మేనేజర్ల వల్ల రామ్ చరణ్ ని కలవలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చరణ్ సాయం చేస్తారనే నమ్మకం తమకు ఉందన్నారు.

 

కాగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. టైటిల్ రోల్ ను మెగాస్టార్ చిరంజీవి పోషిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సురేందర్ రెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైరా షూటింగ్ ఇటీవలే ముగిసింది. సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న తరుణంలో ఉయ్యాలవాడ వంశ కుటుంబ సభ్యులు ఇలా ఆందోళనకు దిగడం చర్చకు దారితీసింది. ఈ ఇష్యూపై మెగా ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది. వాళ్ల ఆరోపణల్లో వాస్తవం ఉందో లేదో తెలియాలంటే రాంచరణ్ నోరు విప్పాల్సిందే.

Tags : chiranjeevifamily membersInfrontmega starprotestRam Charan HouseSye raa narasimha reddyUyyalawada Narasimha Reddy

Also read

Use Facebook to Comment on this Post



Menu