01/21/19 1:01 PM

వచ్చేశాడు : మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో

Vaishnav Tej New Movie Poster Released

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు వచ్చారు. తమ టాలెంట్‌తో ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వీరిలో రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తమకంటూ ఓ రేంజ్‌ సంపాదించుకున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చాడు. సాయిధరమ్ తేజ్ సోదరుడు, మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు.. వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమాను రూపొందిస్తున్నాడు.

 

సుకుమార్ .. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చేపలు పట్టే జాలరి గెటప్‌లో వైష్ణవ్ తేజ్ కనిపిస్తున్నాడు. “2009 లో హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి కూడా నేను నటన పరంగా చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాను. ఈ ఏడాది మా లిటిల్ బ్రదర్ వైష్ణవ్ తేజ్ తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమవుతున్నాడు. నన్ను ఆదరించినట్టే నా సోదరుడిని ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని సాయి దరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.

 

చిరంజీవి మేనల్లుడిగా సాయిధరమ్ తేజ్ కొంతకాలం క్రితం హీరోగా పరిచయమయ్యాడు. తొలి రెండు .. మూడు సినిమాలతోనే మాస్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. పాత సినిమాల్లో చిరంజీవి మాదిరిగానే ఉన్నాడనే కితాబును అందుకున్నాడు. అతడి సోదరుడు వైష్ణవ తేజ్ కూడా నటనవైపే మొగ్గు చూపాడు. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టడంతో తొలి షాట్‌ను హీరో హీరోయిన్లపై చిత్రీకరించారు. హీరోగా వైష్ణవ్ తేజ్ ఎదగాలని మేనమామలు చిరంజీవి, నాగబాబు తమ ఆశీస్సులు అందజేశారు.

Tags : mega familyMegastar chiranjeevinagababunew movie posterSai Dharam TejVaishnav tej

Also read

Use Facebook to Comment on this Post



Menu