01/28/19 12:24 PM

విజయ్ దేవరకొండ రెమ్మునరేషన్ విని దిల్‌రాజుకి దిమ్మతిరిగిందట

Vijay Devarakonda Gives Shock For Dil Raju

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో. మొదటి సినిమా ”అర్జున్ రెడ్డి” తోనే పాపులర్ అయిపోయాడు. యూత్‌‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. వరుస విజయాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోల జాబితాలో విజయ్ చేరిపోయాడు. ‘గీత గోవిందం’ చిత్రంతో వంద కోట్ల క్లబ్‌లోకి చేరాడు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని అనుకున్నాడో, లేక ఓవర్ కాన్ఫిడెన్సో తెలియదు కానీ.. విజయ్ దేవరకొండ ఒక్కసారిగా తన రెమ్మునరేషన్ పెంచేశాడనే వార్తలు ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట.

 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి పెద్ద నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. విజయ్ దేవరకొండకి గల క్రేజ్‌ను, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అతడి వెంటపడుతున్నారు.

 

ప్రముఖ నిర్మాత దిల్ రాజు విజయ్‌తో సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలెట్టినట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. విజయ్‌తో సినిమా చేయాలనుకున్న దిల్ రాజు అతడిని సంప్రదించగా.. విజయ్ చుక్కలు చూపించాడట. ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడట. దీంతో దిల్ రాజు మైండ్ బ్లాంక్ అయ్యిందట. నాని, శర్వానంద్ వంటి హీరోలు కూడా ఈ రేంజ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం లేదు. దాంతో దిల్ రాజు ఆలోచనలో పడ్డాడని చెప్పుకుంటున్నారు.

 

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న సినిమాకు కూడా ఇంతే మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ సినిమాలకు వస్తున్న కలెక్షన్లు, జనాల్లో అతడికున్న క్రేజ్‌ని బట్టి చూస్తే విజయ్ అడిగిన రెమ్యునరేషన్ సబబుగానే ఉందనే వారూ లేకపోలేదు. కానీ దిల్ రాజు మాత్రం అంత ఇవ్వడానికి సిద్ధంగా లేడట.

Tags : arujn reddycomradedil rajushock for dil rajuvijay demand ten croresvijay devarakondavijay devarakonda remuneration

Also read

Use Facebook to Comment on this Post



Menu