04/24/18 9:35 PM

సావిత్రి గురించి విజయ్ దేవరకొండ నీచంగా మాట్లాడాడా ?

Untitled-1 copy

టాలీవుడ్ యువ కథానాయకుల్లో విజయ్ దేవరకొండ వ్యక్తిత్వం, మాటతీరు చాలా విభిన్నం. ఇతర కుర్ర హీరోలతో పోలిస్తే ఎంతటి విషయాన్నైనా నిర్మొహమాటంగా బహిరంగ వేదికల్లో చాలా ధైర్యంగా చమత్కారంగా.. చురకలు.. అంటిస్తూ ముక్కుసూటిగా మొహం మీద మాట్లాడినట్టు చెప్పేస్తాడు. అయితే ఈ యంగ్ హీరో సావిత్రి బయోపిక్ ‘మహానటి’ సినిమాలో ఓ పాత్ర పోషించాడు. ఈ సినిమా వచ్చే నెల 11న విడుదలవుతుంది.

 

ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్ లో విజయ దేవరకొండ చాలా బిజీబిజీగా ఉన్నాడు. సినిమాకి సంబంధించి విజయ దేవరకొండ ఇటీవల  ‘వాట్ ఏ కూల్ చిక్.. మహానటి’ అంటూ సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ గురించి కామెంట్ చేశాడు. దీనిపై నెటిజన్లు విజయ్ ను తప్పుపడుతూ విమర్శలు గుప్పించారు.

 

దీంతో విజయ్ దేవరకొండ ఓ రేంజ్ లో వారందరికీ కౌంటర్ ఇచ్చాడు. ‘నా నుంచి క్షమాపణ కోరుకుంటున్న ఎవరైనా సరే.. చెన్నై లీలా ప్యాలెస్ లో ఉన్నా వచ్చేయండి. నేను మీకు మహానటి ఆడియో లాంచ్ కి ఎంట్రీ పాసులు కూడా ఇస్తాను. మీరంతా అప్పుడు ఉండి ఉంటే ఆమె చాలా సంతోషించేది. ఎందుకంటే అప్పుడు మీలాంటి నీతులు నియమాలు చెప్పే బ్యాచ్ ఆమెను సంసారం విచ్ఛిన్నం చేసిందని.. తాగుబోతు అని కామెంట్స్ చేశారు’ అంటూ రివర్స్ లో కౌంటర్ వేసి తనను దూషించిన వారిని నోరు మూయించాడు విజయ్.

Tags : Keerthi SureshMahanatisavithrisavitriSavitri Biopicvijay commentsVijay DeverakondaVijaydevarakonda

Also read

Use Facebook to Comment on this Post



Menu