Ad

03/12/18 9:20 PM

ఇప్పటివరకు చేయని పాత్రలో అర్జున్ రెడ్డి హీరో..!

Untitled-1 copy

‘అర్జున్ రెడ్డి’ సినిమా ఇచ్చిన విజయంతో కెరీర్ లో దూసుకెళ్తున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో ఒక హీరో విజయ్ దేవరకొండ. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ కన్ను కోలీవుడ్ ఇండస్ట్రీ పై పడింది. ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు ఆనంద శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు.

 

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నెగిటివ్ పాత్రలో విలన్ షేడ్ ఫ్లేవర్ ఉండే రోల్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి ‘నోటా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. విజయ్ దేవరకొండ నోటా ఒప్పుకోవడానికి కారణం కూడా గతంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ వచ్చిన ఏ సినిమాలోనూ లేని ప్రత్యేకత ఇందులో ఉండటమేనట. మొదట నెగటివ్ గా అనిపించినా దాని వెనుక సహేతుక కారణం ఉంటుందని ఎన్నికల వ్యవస్థను మార్చడానికి నడుం బిగించిన ఒక యువకుడి కథగా నోటా ఉంటుందని తెలిసింది.

 

ఈ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నాడు విజయ దేవరకొండ. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది.

Tags : Arjun reddyinked fignerkollywoodnotaParasu ramRGVTamil movieVijay devara kondaVijay Deverakonda

Also read

Use Facebook to Comment on this Post



Menu