01/14/19 8:11 PM

వినయ విధేయ రామ : లాభానికి ఇంకా రూ.50కోట్లు

Vinaya Vidheya Rama box office collection Day 3

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి కానుకగా జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాకు విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చిన విషయం విదితమే. ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ మూవీలోని కొన్ని సీన్లు చాలా సిల్లీగా, కామెడీగా ఉన్నాయనే విమర్శలు తీవ్రంగా వినిపించాయి. కొన్ని సీన్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తు ట్రోల్ చేశారు.

 

సినిమా దారుణం అన్నా.. కలెక్షన్ల విషయానికి వస్తే కొంత ఊరట కలిగించింది. వీవీఆర్ మూడు రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి వీకెండ్ పూర్తయ్యే వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ని సాధించింది. తొలిరోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజుకి కలెక్షన్లు కాస్త డ్రాప్ అయ్యాయి. మూడో రోజు పుంజుకున్నట్లుగా అనిపించినా మిగిలిన సినిమాల జోరు పెరగడంతో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. నెగటివ్ టాక్ వచ్చినా సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం మంచి విషయమని అంటున్నారు. ఓవర్సీస్‌లో మాత్రం ఈ సినిమా పరిస్థితి దారుణంగా ఉంది.

 

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా వసూళ్లు:
నైజాం : 8.01 కోట్లు
సీడెడ్ : 8.30 కోట్లు
నెల్లూరు : 1.99 కోట్లు
ఈస్ట్ : 2.51 కోట్లు
వెస్ట్ : 2.28 కోట్లు
కృష్ణ : 2.06 కోట్లు
గుంటూరు : 4.85 కోట్లు
ఉత్తరాంధ్ర : 3.41 కోట్లు

 
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.33.41 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మరో రూ.4.95 కోట్లు, ఓవర్సీ‌‌స్‌లో రూ.1.40 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 39.76 కోట్లను వసూలు చేసింది.

 

వినయ విధేయ రామ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.92.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.70 కోట్లకుపైగా గ్రాస్, రూ.40 కోట్లకుపైగా షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే, డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే ఇంకా రూ.50 కోట్లకుపైనే వసూలు చేయాల్సి ఉంటుంది. మరి సాధిస్తుందో లేదో చూడాలి.

Tags :

Also read

Use Facebook to Comment on this Post



Menu