11/24/18 10:00 AM

మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి కార్తీక పౌర్ణమి కానుక..!

Vinaya Vidheya Rama New Poster

సినిమా జనాలకు రీచ్ కావాలంటే ప్రమోషన్స్ చాలా ముఖ్యం. ఎంతగా ప్రమోషన్స్ చేస్తే అంత లాభం కలుగుతుంది. అందుకే తమ చిత్రాల ప్రచారానికి ఏ చిన్న సందర్భాన్ని, అవకాశాన్నికూడా వదలుకోరు మూవీ మేకర్స్. పండుగ పేరుతో ఒకరు, హీరో పుట్టిన రోజుతో మరొకరు ప్రచార చిత్రాలను రిలీజ్ చేయడం చూశాం.

 

రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో శ్రీమతి పార్వతి సమర్పణలో డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా ఇది. తాజాగా కార్తీక పౌర్ణమిని(నవంబర్ 23) పురస్కరించుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ న్యూ లుక్ రిలీజ్ చేసింది ‘వినయ విధేయ రామ’ చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో రాంచరణ్ అదిరిపోయే క్లాస్ లుక్‌లో దర్శనం ఇస్తున్నాడు. రాంచరణ్ సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఈ పోస్టర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. నుదుటిన బొట్టు, సంప్రదాయ పంచెకట్టులో చక్కగా బుద్దిమంతుడిలా కనిపిస్తాడు. హారతి ఇస్తుండగా దండం పెడుతున్న లుక్ రిలీజ్ చేసారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అని పోస్టర్ పై రాసి ఉంది. సంక్రాంతికి కలుద్దాం అంటూ చిత్ర యూనిట్ ఈ పోస్టర్‌ను ట్వీట్ చేసింది.

 

దీపావళి సందర్భంగా ఫస్ట్‌లుక్ లాంచ్ చేసిన చిత్ర బృందం, ఆ తర్వాత టీజర్ రిలీజ్ చేసింది. టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం 24 గంటల్లోనే కోటి 51 లక్షల డిజిటల్ వ్యూస్ రాబట్టి రికార్డు సృష్టించింది. ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న వినయ విధేయ రామలో చరణ్ పక్కన కియారా అడ్వాణి హీరోయిన్‌గా నటిస్తుండగా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ (జీన్స్‌ ఫేమ్) చరణ్ అన్నయ్యలుగా నటించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా చేశాడు. స్నేహ, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2019లో సంక్రాంతి కానుకగా.. వినయ విధేయ రామ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags : boyapati srinukarthika pournami wishesRam Charan new lookVinaya Vidheya Rama New Poster

Also read

Use Facebook to Comment on this Post



Menu