01/5/19 12:22 PM

రిలీజ్‌కు ముందే రికార్డుల మోత

Vinaya Vidheya Rama Pre Release Business

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన మూవీ వినయ విధేయ రామ. ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, ప్రోమో, ట్రైలర్‌లు ఆడియన్స్‌లో క్యూరియాసిటీని పెంచేశాయి. ఇదిలా ఉంటే వినయ విధేయ రామ.. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో అదుర్స్ అనిపించింది.

 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 77 కోట్ల బిజినెస్ చేసింది. ఓవర్ సీస్‌లో 9 కోట్లు.. కర్ణాటక, తమిళనాడు దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపి మొత్తం రూ. 94.50 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.

 

ఏరియా వైజ్ వివరాలు:
నైజాం : రూ.20 కోట్లు, సీడెడ్ : 15, ఉత్తరాంధ్ర : 11.70, ఈస్ట్ : 7.20, వెస్ట్ : 5.60, కృష్ణా : 6, గుంటూరు : 7.80, నెల్లూరు : 3.30.. ఏపీ, తెలంగాణ : రూ.77 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ఇండియా : రూ.8.50 కోట్లు, ఓవర్సీస్ : రూ.9 కోట్లు.. టోటల్ వరల్డ్ వైడ్ రూ.94.50 కోట్లు.

 

బోయపాటి మాస్‌ టేకింగ్‌, రామ్‌చరణ్‌ యాక్షన్‌ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. రామ్‌చరణ్ తన నటనలోని విశ్వరూపాన్ని చూపించేశారని చెబుతున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతమందించారు. భరత్‌ అనే నేను ఫేమ్‌ కియారా అద్వానీ హీరోయిన్‌. స్నేహ, ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేశ్‌, వివేక్‌ ఒబేరాయ్‌ కీలకపాత్రల్లో నటించారు. 2018లో రంగస్థలంతో బ్లాక్ బస్టర్ కొట్టిన చరణ్ వినయ విధేయ రామతో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

Tags : boyapati srinuram charanVinaya Vidheya Ramavinaya vidheya rama pre release businessVVR

Also read

Use Facebook to Comment on this Post



Menu