06/13/18 8:22 PM

పూరీ జగన్నాథ్‌, వినాయక్‌ల పాలిట ‘దేవుడు’ బాలయ్య!

Untitled-1 copy

ఒకప్పుడు స్టార్ డైరక్టర్లుగా వెలుగొందిన పూరీ జగన్నాథ్‌లు.. వినాయక్‌లు ప్రస్తుతం కెరీర్‌ పరంగా చాలా డౌన్‌లో ఉన్నారు. ఇటీవల కాలంలో వీరిద్దరి  సక్సెస్ ట్రాక్ రికార్డ్‌ సరిగ్గా లేకపోవడంతో వీరితో సినిమాలు చేయడానికి ప్రస్తుతం ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పూరీకి సరైన హిట్ పడి చాలా ఏళ్లు అవుతోంది. వినాయక్ పరిస్థితి కూడా దాదాపు అంతే! ఈ పదేళ్ల కాలంలో అప్పుడెప్పుడో ‘అదుర్స్‌’..  ఈ మధ్యన ‘ఖైదీ నెం.150’ మినహా   వినాయక్‌ చిత్రాలేవీ బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా ఆడలేదు. ‘ఖైదీ నెం.150’ మంచి హిట్ అయినప్పటికీ.. ఆ  సినిమా సక్సెస్‌ క్రెడిట్ ఎక్కువుగా మెగాస్టార్ ఖాతాలోకి వెళ్లింది. ఈ చిత్రం తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా అతడు డైరక్ట్ చేసిన ‘ఇంటెలిజెంట్‌’ బాక్సాఫీస్ దగ్గర ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.  అంతకు ముందు అఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది.

 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరిద్దరితో చేయడానికి అగ్ర హీరోల సంగతి ప్రక్కనపెడితే మీడియం రేంజ్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో  వీరిద్దరికీ బాలకృష్ణ అనుకోని దేవుడిలా మారారు. పూరీ జగన్నాథ్ తో సినిమాలు చేయడానికి మిగతా హీరోలు భయపడుతున్న తరుణంతో అతడికి ‘పైసా వసూల్’ సినిమా చేశాడు బాలయ్య.. అంతేనా ‘పైసా వసూల్’ ఫ్లాప్ అయినప్పటికీ పూరీ జగన్నాథ్‌తో మరో సినిమా చేసేందుకు కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  ‘మెహబూబా’ లాంటి అట్టర్‌ఫ్లాప్ తర్వాత ప్రస్తుతం  బాలయ్య కోసం ఓ మంచి సబ్జెక్ట్ రెడీ చేసుకునే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు పూరీ..

 

ఇక పూరీ జగన్నాథ్‌ సంగతి ప్రక్కనపెడితే.. తాజాగా వివి వినాయక్‌తో చేసేందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే బాలయ్య ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే కసితో వినాయక్‌కు వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కునున్న ఈ చిత్రంలో బాలయ్య ఫ్యాక్షన్‌ లీడర్‌ పాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతం బాలయ్య చేస్తోన్న బయోపిక్ తర్వాత ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.. ఈ చిత్రానికి ‘ఏకే-47’ అనే టైటిల్ ను వినాయక్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే, సక్సెస్‌లతో సంబంధం లేకుండా అవకాశాలిస్తున్న బాలయ్యను చూస్తుంటే ఇండస్ట్రీలో ఆయన అంత ‘డేరింగ్‌..డాషింగ్‌.. గట్సీ’ హీరో మరొకరు లేరని చెప్పకతప్పదు.

 

Tags : AK-47balayyapaisa vasoolPuri Jagannadhvv vinayak

Also read

Use Facebook to Comment on this Post



Menu