05/2/19 11:59 AM

కావాలనే చేశాడా? తనకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడిని మర్చిపోయిన మహేష్

Why Mahesh Babu Forgets Puri Jagannath Name

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కు మధ్య విభేదాలు ఉన్నాయా? ఇద్దరూ గొడవ పడ్డారా? ఇద్దరి మధ్య ఏం జరిగింది? సినీ వర్గాల్లో ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి కారణం లేకపోలేదు. మహేష్ బాబు చేసిన పని ఇండస్ట్రీలో డిస్కషన్ కు దారితీసింది. మహేష్ నటించిన ‘పోకిరి’ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. మహేష్ కెరీర్ లోనే కాదు.. ఇండస్ట్రీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా పోకిరి. ఈ సినిమాకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఆ తర్వాత ‘బిజినెస్ మేన్’ రూపంలో మహేష్ కి మరో హిట్ నూ అందించాడు పూరీ. మహేష్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ సినిమా పోకిరి. తన కెరీర్ లో అంతటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పూరీని.. మహేష్ మర్చిపోయాడు. అందరి డైరెక్టర్ల పేర్లు చెప్పిన మహేష్.. పూరీ పేరు మాత్రం చెప్పలేదు. కావాలనే అలా చేశాడో, లేక నిజంగానే మర్చిపోయాడో కానీ.. పూరీ పేరుని మాత్రం ప్రస్తావించలేదు.

 

మ్యాటర్ ఏంటంటే.. మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’ ప్రీ రిలీజ్ వేడుక బుధవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన ప్రిన్స్, తనకు సక్సెస్‌ ఇచ్చిన ఒక్కో దర్శకుడి పేరును చెబుతూ వారికి కృతజ్ఞతలు చెప్పాడు. తన తొలి చిత్రం ‘రాజకుమారుడు’ దర్శకుడు రాఘవేంద్రరావు నుంచి మలి చిత్ర దర్శకుడు కొరటాల శివ వరకూ అందరి పేర్లనూ చెప్పిన మహేష్.. పూరీ జగన్నాథ్ పేరును మాత్రం చెప్పలేదు. ‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన దర్శకుడి పేరుని మహేష్ ప్రస్తావించకపోవడం డిస్కషన్ కు దారితీసింది. మహేష్ మర్చిపోయాడా? లేకా కావాలనే పూరీ పేరు ప్రస్తావించలేదా? అనేది అంతుచిక్కడం లేదు. ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? నిజంగానే మహేష్ కు గుర్తులేదా? అన్న అనుమానాలు సినీ అభిమానుల్లో మొదలయ్యాయి. వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్ లో ‘జనగణమన’ అనే సినిమా చాలా నెలల క్రితమే అనౌన్స్ అయినప్పటికీ, పట్టాలు ఎక్కలేదు. ఈ సినిమా విషయంలోనే ఇద్దరి మధ్యా దూరం పెరిగిందన్న వార్తలూ వచ్చాయి.

 

అయితే పూరీ, మహేష్ మధ్య విభేదాల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో వివాదరహితుడిగా పేరున్న మహేష్.. వెంటనే స్పందించాడు. ఈ విభేదాల చర్చకు చెక్ చెప్పాలని భావించాడు. ట్విట్టర్‌ లో పూరీకి థ్యాంక్స్‌ చెప్పాడు. ”నా 25 సినీ జర్నీలో ముఖ్యమైన వ్యక్తి పేరు చెప్పడం మిస్ అయ్యాను. నన్ను సూపర్ స్టార్ చేసిన సినిమా పోకిరీ. థ్యాంక్యూ సో మచ్ పూరీ జగన్నాథ్. జీవితాంతం గుర్తిండిపోయే సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్” అని ట్విట్టర్ ద్వారా పూరీకి మహేష్ కృతజ్ఞతలు తెలిపాడు. దీనికి వెంటనే పూరీ స్పందించాడు. ”థ్యాంక్యూ సో మచ్ సార్.. ఆల్వేస్ లవ్ యు..మహర్షి ట్రైలర్ రాకింగ్” అని పూరీ బదులిచ్చాడు. అలా వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం మహేస్ చేశాడు. ఏది ఏమైనా అంతపెద్ద సభలో పూరీ పేరు ప్రస్తావించకపోవడం అభిమానులను హర్ట్ చేసింది.

Tags : business manforgetMaharshimaharshi pre release eventmahesh babuPokiripuri jagan

Also read

Use Facebook to Comment on this Post



Menu