07/20/18 7:10 PM

w/o రామ్ మూవీ రివ్యూ

wife of ram reviews

w/o రామ్ మూవీ రివ్యూ

 

నటీనటులు : మంచు లక్ష్మి , ప్రియదర్శి ,సామ్రాట్ రెడ్డి , ఆదర్శ్  బాలకృష్ణన్‌

దర్శకత్వం : విజయ్ యేలకంటి

నిర్మాతలు : విశ్వప్రసాద్ టి జి , మంచు లక్ష్మి

బ్యానర్‌ః పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌

సంగీతం : రఘు దీక్షిత్

సినిమాటోగ్రఫర్ : సామల భాస్కర్

ఎడిటర్ : తమ్మిరాజు

 

కథః

రామ్( సామ్రాట్‌ ).. అతడి ప్రెగ్నెంట్ వైఫ్ దీక్ష ( మంచు లక్ష్మీ) ఓ ఘోరమైన యాక్సిడెంట్‌ కారణంగా హాస్పిటల్ పాలవుతారు. ప్రమాదంలో భర్త రామ్ చనిపోగా దీక్ష ప్రాణాలతో బయటపడుతుంది. తమకు జరిగింది యాక్సిడెంట్‌ కాదని.. తమను చంపడానికి ఎవరో చేసిన ప్రీ ప్లాన్‌డ్ మర్డర్ అని నమ్మి దీక్ష పోలీసులకు ఫిర్యాదు చేస్తోంది. అయితే, ఇన్‌వెస్టిగేషన్ కు పోలీసులు సహకరించకపోవడంతో తనే సొంతంగా ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభిస్తుంది. ఫైనల్‌గా అనేక కష్టనష్టాలు తర్వాత తన భర్త మర్డర్ మిస్టరీ ఆమె ఎలా చేధించదనేదే మిగతా కథ!

ఫెర్‌ఫార్మెన్స్ స్‌: 

 

నటనకు స్కోప్ ఉన్న పాత్రలో మంచు లక్ష్మీ ఇరగదీసిందనే చెప్పాలి. చాలా సెటెల్డ్ గా నటిస్తూ.. ఎమోషన్స్ ను అండర్ ప్లే చేస్తూ ఆమె ఈ సినిమాను తన భుజస్కంధాలపై మోసింది. అయితే, పలు చోట్ల ఆమె పాష్‌   డైలాగ్‌ డెలివరీ  కాస్త కామెడీగా అనిపించక మానదు. ఇక, దీక్షకు సపోర్ట్ చేసే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రియదర్శి చక్కగా నటించాడు. ఇక బ్యాడ్ బాయ్‌గా ఆదర్శ బాలకృష్ణన్‌ ఆకట్టుకునేలా నటించాడు. ఇక, ‘బిగ్‌బాస్ సీజన్ 2’ ఫేం సామ్రాట్‌ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో ప్రభావంతంగా నటించాడు

ఎనాలిసిస్‌: 

ఎప్పటికప్పుడు నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందా అనే ఉత్సుకతను, సస్పెన్స్‌ను.. ఏంగ్జయిటీని ప్రేక్షకుల్లో కలిగించే థ్రిల్లర్ సినిమాలే బాక్సాఫీస్ దగ్గర హిట్ అవుతాయి. కానీ, ‘w/o రామ్‌’ లో చాలా చోట్ల ఈ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి  ఈ మర్డర్ మిస్టరీకి ఫస్ట్ హాఫ్ పెద్ద మైనస్ అనే చెప్పాలి. సినిమా మొదటి అర్థభాగంగా చాలా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది.  ఫస్ట్ హాఫ్‌లో కేసును దీక్ష  ఇన్‌వెస్టిగేట్  చేసే సన్నివేశాలు అత్యంత పేలవంగా ఉన్నాయి. కనీసం ఇంటర్వెల్ ట్విస్ట్‌ ను ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా దర్శకుడు విజయ్ యేలకంటి రాసుకోలేదు. అయితే, సెకండ్ హాఫ్‌ను కథనంలో వేగం పెంచి సినిమాపై ఆసక్తిని దర్శకుడు పెంచగలిగాడు. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ రివీల్ చేసిన తీరు కూడా బాగుంది. అయితే మళ్లీ క్లైమాక్స్ ను పూర్తి సినిమాటిక్‌గా,  కామెడీగా తీసి దర్శకుడు నిరాశపరిచాడు. మొత్తానికి, కేవలం రెండు గంటల నిడివి గల సినిమా.. థియేటర్ బయటకు వచ్చాక అంత కన్నా ఎక్కువ రన్ టైం ఉన్న సినిమాలా అనిపిస్తుంది.

పాజిటివ్స్‌:
మంచు లక్ష్మీనటన
సెకండ్ హాఫ్‌
ట్విస్ట్‌
రఘు దీక్షిత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌

నెగటివ్స్‌

బోరింగ్ ఫస్ట్ హాఫ్‌
క్లైమాక్స్‌

ఫైనల్ పంచ్ః  క్రైమ్ థ్రిల్లర్స్ మీద ఆసక్తి ఉంటే ఓ సారి చూడవచ్చు లేకపోతే అనవసరం

 

రేటింగ్ః 2.75/5

Tags : Lakshmi Manchuvijay yelakantiwife of ramwife of ram movie review

Also read

Use Facebook to Comment on this PostMenu