12/18/18 7:55 PM

ఈ సినిమాతో అయినా పక్కాగా హిట్ కొడతాడా?

Will Kalyan Ram Get Hit

కళ్యాణ్ రామ్.. ఈ నందమూరి హీరో ప్రస్తుతం హిట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు. ఈ ఏడాది చేసిన రెండు సినిమాలు డిజాస్టర్స్ కావడంతో.. ఈసారి కసిగా ఉన్నాడు. 118 అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కళ్యాణ్‌ రామ్‌కి జోడిగా నివేతా థామస్, షాలిని పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది.

 

భార్య భర్తలుగా ఉన్న కళ్యాణ్ రామ్, షాలిని పాండేల జీవితంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం. షాలిని పాండేపై అటాక్ జరగడం.. ఆ అటాక్‌కి ‘1:18’కి లింక్ ఉండటం… వాటిని కళ్యాణ్ రామ్ ఛేదించడం లాంటివి ఆసక్తికరంగా టీజర్‌లో ప్రజెంట్ చేశారు దర్శకుడు. 118 అంటే ఏదో నెంబర్ అని అపోహపడిన ప్రేక్షకులకు టీజర్‌లో క్లూ ఇచ్చేసాడు డైరెక్టర్ గుహన్. 118 అనేది డోర్ నెంబర్ కాదు టైం.. అర్ధరాత్రి 1 గంట 18 నిమిషాలకు జరిగిన సంఘటనతో కళ్యాణ్ రామ్ లైఫ్ ఏ విధమైన మలుపు తిరిగింది అనే దాన్ని సినిమాలో చూపించబోతున్నారు.

 

ఈ టీజర్‌లో ఎక్కడా.. హీరోయిన్ నివేదా థామస్ కనిపించకపోగా.. కళ్యాణ్ రామ్, షాలిని పాండే జోడీని చాలా అందంగా చూపించారు సినిమాటోగ్రాఫర్ కమ్ దర్శకుడు కేవీ గుహన్. ఇద్దరి మధ్య కెమిస్ట్రీని బాగా వర్కౌట్ చేశారు. కళ్యాణ్ రామ్ లుక్స్ కొత్తగా ఉన్నాయి. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం టీజర్‌కు మరింత బలాన్ని ఇచ్చింది. జనవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘118’ మూవీ.

 

ఎప్పుడూ కమర్షియల్ సినిమాలనే నమ్ముకునే కళ్యాణ్ రామ్ ఇలా ఇపుడు థ్రిల్లర్ నేపథ్యం ఉన్న విభిన్న కథను ఎంచుకుని వైవిధ్యం చూపిస్తున్నాడు. టీజర్‌తో సినిమాపై అంచనాలైతే పెంచగలిగారు. మరి ఈ సినిమాతో అయినా కళ్యాణ్ రామ్ పక్కాగా హిట్ కొడతాడో లేదో చూడాలి.

Tags : 118 movie teaserdirector kv guhankalyan ramkalyanram nandamuriNandamuri Kalyan ramnivetha thomasShalini pandey

Also read

Use Facebook to Comment on this Post



Menu